LOADING...
Kia Carens Clavis HTE (EX) : రూ.12.54 లక్షలకే సన్‌రూఫ్‌తో కియా కారెన్స్ క్లావిస్ లాంచ్
రూ.12.54 లక్షలకే సన్‌రూఫ్‌తో కియా కారెన్స్ క్లావిస్ లాంచ్

Kia Carens Clavis HTE (EX) : రూ.12.54 లక్షలకే సన్‌రూఫ్‌తో కియా కారెన్స్ క్లావిస్ లాంచ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 16, 2026
03:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

కియా ఇండియా తన కారెన్స్ క్లావిస్ (ICE) లైనప్‌లో కొత్తగా HTE (EX) ట్రిమ్‌ను అధికారికంగా విడుదల చేసింది. ప్రీమియం ఫీచర్లతో పాటు పోటీ ధరలను అందించడమే లక్ష్యంగా ఈ కొత్త వేరియంట్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఫీచర్ల పరంగా మెరుగైన విలువను అందిస్తూ, కస్టమర్ల అంచనాలకు తగ్గట్లుగా ఈ ట్రిమ్‌ను రూపొందించినట్లు కియా వెల్లడించింది. HTE (EX) ట్రిమ్ ధరలు (ఎక్స్-షోరూమ్) G1.5 పెట్రోల్ వేరియంట్ : రూ.12,54,900 G1.5 టర్బో పెట్రోల్ వేరియంట్: రూ.13,41,900 D1.5 డీజిల్ వేరియంట్ : రూ.14,52,900

Details

ఇందులో 7-సీటర్ కాన్ఫిగరేషన్

ఎక్కువ ఫీచర్లు జోడించినప్పటికీ ధరలను అందుబాటులో ఉంచడంపై కియా ప్రత్యేక దృష్టి సారించినట్లు ఈ వేరియంట్ స్పష్టంగా చూపిస్తోంది. కస్టమర్ల నుంచి వచ్చిన అభిప్రాయాలు, మారుతున్న మార్కెట్ అవసరాలను పరిగణనలోకి తీసుకొని HTE (EX) ట్రిమ్‌ను అభివృద్ధి చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఈ కొత్త ట్రిమ్ అన్ని ICE పవర్‌ట్రెయిన్‌లలో G1.5 పెట్రోల్, G1.5 టర్బో పెట్రోల్, D1.5 డీజిల్ అందుబాటులో ఉండగా, దీనిని 7-సీటర్ కాన్ఫిగరేషన్‌లో మాత్రమే విక్రయిస్తున్నారు. ముఖ్యంగా కారెన్స్ క్లావిస్ G1.5 పెట్రోల్ పవర్‌ట్రెయిన్‌లో తొలిసారిగా సన్‌రూఫ్‌ను అందించడం ఈ వేరియంట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

Details

తొలిసారిగా స్కైలైట్ సన్‌రూఫ్

ఈ లాంచ్‌పై కియా ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అటుల్ సూద్ స్పందిస్తూ, కస్టమర్ల అభిరుచులే కారెన్స్ క్లావిస్ (ICE) శ్రేణిలో HTE (EX) ట్రిమ్‌ను పరిచయం చేయడానికి ప్రేరణగా నిలిచాయన్నారు. వినియోగదారులు ఎక్కువగా కోరుకునే సౌకర్యాలు, ఫీచర్లను దృష్టిలో పెట్టుకుని, ముఖ్యంగా G1.5 పవర్‌ట్రెయిన్‌లో తొలిసారిగా స్కైలైట్ సన్‌రూఫ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఈ వేరియంట్ కారెన్స్ క్లావిస్‌ను కుటుంబాలకు మరింత ఆకర్షణీయమైన ఎంపికగా మార్చడమే కాకుండా, భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో కియా స్థాయిని మరింత బలోపేతం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా కియా కారెన్స్ క్లావిస్ HTE (EX) వేరియంట్‌లో పలు ప్రీమియం సౌకర్యాలను కంపెనీ జోడించింది.

Advertisement

Details

ఫీచర్లు ఇవే

స్కైలైట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ (G1.5 పవర్‌ట్రెయిన్‌లో తొలిసారి) పూర్తిగా ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ (FATC), LED డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్, పొజిషన్ ల్యాంప్స్, LED క్యాబిన్ లైట్స్, * డ్రైవర్ సైడ్ ఆటో అప్/డౌన్ పవర్ విండో వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ అదనపు ఫీచర్లతో క్యాబిన్‌లో మరింత విశాలత, సౌకర్యం, భద్రతను అందించడంతో పాటు, కారు ఎక్స్‌టీరియర్‌కు ప్రీమియం లుక్‌ను కూడా కియా అందిస్తోంది. HTE (EX) వేరియంట్ ప్రవేశంతో కారెన్స్ క్లావిస్ (ICE) లైనప్ మరింత బలోపేతమైంది. డిజైన్‌, టెక్నాలజీ, ప్రాక్టికాలిటీని సమన్వయపరిచిన ఉత్పత్తులను కస్టమర్ అవసరాలకు అనుగుణంగా అందించడమే తమ లక్ష్యమని కియా మరోసారి స్పష్టం చేసింది.

Advertisement