LOADING...
Kia Carens EV : 500 కి.మీ రేంజ్‌తో రానున్న కియా క్యారెన్స్ EV.. టాప్ ఫీచర్లు ఇవే!
500 కి.మీ రేంజ్‌తో రానున్న కియా క్యారెన్స్ EV.. టాప్ ఫీచర్లు ఇవే!

Kia Carens EV : 500 కి.మీ రేంజ్‌తో రానున్న కియా క్యారెన్స్ EV.. టాప్ ఫీచర్లు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 23, 2025
03:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ కొరియాలో దర్శనమిచ్చిన కియా క్యారెన్స్ EV ప్రోటోటైప్ భారత మార్కెట్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా నిలుస్తోంది. ఈ మోడల్ తాజాగా కెమెరాలకు చిక్కింది. దీని డిజైన్, ఫీచర్లు, రేంజ్‌ గురించి ఆసక్తికర వివరాలు బయటకొచ్చాయి. భారత ప్యాసింజర్ వాహన మార్కెట్‌లో EV డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఇప్పటికే కియా EV6, EV9 మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసిన కియా, మాస్-మార్కెట్ విభాగాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో కియా క్యారెన్స్ EV ను సిద్ధం చేస్తోంది.

Details

డిజైన్, ఎక్స్‌టీరియర్ 

నోస్​కి కనెక్టెడ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్ (DRL) స్ట్రిప్‌తో, త్రిభుజాకార ఆకృతిలో ఉండే LED హెడ్‌లాంప్స్‌ ఆకర్షణగా ఉన్నాయి. లైటింగ్ డిజైన్ చూస్తే EV6 మోడల్‌ను పోలి ఉంటుంది. కానీ ఛార్జింగ్ పోర్ట్ పొజిషనింగ్ భిన్నంగా ఉంటుంది. కారెన్స్ EVలో ఆరోడైనమిక్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. కారెన్స్ EVలో ADAS సిస్టమ్ ఉండనుంది. విండ్ షీల్డ్‌లో కెమెరా ఉండడం ADAS సౌకర్యాన్ని ధృవీకరిస్తోంది. ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, సైడ్ సెన్సార్లు కూడా ఉండే అవకాశముంది.

Details

ధర రూ.30లక్షలుండే అవకాశం

వైర్లెస్ ఫోన్ ఛార్జర్, డ్యూయల్ జోన్ ఆటో ఏసీ, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి హై-ఎండ్ ఫీచర్లు ఉన్నాయి. ఫ్రంట్-రేర్ పార్కింగ్ సెన్సార్లు అందుబాటులో ఉంటాయి. స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్ బ్యాగులు, 360 డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా కూడా ఉంటుంది. పవర్‌ట్రెయిన్, రేంజ్ కియా పవర్‌ట్రెయిన్ స్పెసిఫికేషన్లను అధికారికంగా ప్రకటించలేదు. అయితే క్యారెన్స్ EV 400 కి.మీ - 500 కి.మీ మధ్య రేంజ్‌ను అందిస్తుందని అంచనా. వేర్వేరు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌లో ఈ కారు లభించే అవకాశం ఉంది. కియా క్యారెన్స్ EV భారత మార్కెట్లో 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది. ధర విషయానికి వస్తే, ఇది రూ. 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ఉండవచ్చని అంచనా.