
Kia Carens Clavis: కియా సంస్థ కరెన్స్ క్లావిస్.. మే 9 నుంచి బుకింగ్‌లు ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ కియా మోటార్స్, భారత మార్కెట్‌లో మంచి ఆదరణ పొందిన తమ ఎంపీవీ కరెన్స్‌ను కొత్త రూపంలో కియా కరెన్స్ క్లావిస్ పేరుతో గురువారం ఆవిష్కరించింది.
ఇందులో ఆధునిక ఫీచర్లు, కొత్త డిజైన్, మెరుగైన భద్రతా సదుపాయాలను చేర్చింది.
అయితే, కారును ఎంత ధరకు విక్రయించనున్నారన్న వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. మే 9 నుంచి బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి.
వివరాలు
కరెన్స్ క్లావిస్‌లో మూడు రకాల ఇంజిన్ ఎంపికలు ఉన్నాయి. అవి:
1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్. ఈ కొత్త మోడల్ మొత్తం 7 ట్రిమ్స్‌లో లభించనుంది.
రంగుల విషయానికి వస్తే .. ఐవరీ సిల్వర్ గ్లోస్, ప్యూటర్ ఆలివ్, ఇంపీరియల్ బ్లూ, గ్లేసియర్ వైట్ పెరల్, గ్రావిటీ గ్రే, స్పార్క్లింగ్ సిల్వర్, ఆరోరా బ్లాక్ పెరల్, క్లియర్ వైట్ రంగుల్లో ఇది వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.
వివరాలు
బాహ్య రూపకల్పన (ఎక్స్‌టీరియర్):
ఈ మోడల్‌లో కియా సిగ్నేచర్ డిజిటల్ టైగర్ ఫేస్, ఐస్‌క్యూబ్ ఎంఎఫ్‌ఆర్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, స్టార్ మ్యాప్ ఎల్‌ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్లు ఉన్నాయి.
అలాగే పనోరమిక్ సన్‌రూఫ్, స్పోర్టీ అల్లాయ్ వీల్స్ కారుకు ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తున్నాయి.
అంతర్గత ఏర్పాట్లు (ఇంటీరియర్):
క్లావిస్ మోడల్‌లో ముందు సీట్లు వాక్-ఇన్ స్లయిడింగ్ లివర్‌తో ఉంటాయి. 26.62 అంగుళాల డ్యూయల్ పనోరమిక్ డిస్‌ప్లే ప్యానెల్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, టచ్ ఆధారిత క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో లభిస్తాయి.
వివరాలు
భద్రతా ఫీచర్లు:
ఈ కారులో 20కి పైగా లెవెల్-2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లు ఉంటాయి.
అంతేకాకుండా.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, ఫార్వర్డ్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్, లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ కొలిజన్ వార్నింగ్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లను అందిస్తోంది.
కియా కంపెనీ ఈ కారుకు సంబంధించిన ధరను జూన్ 2న అధికారికంగా ప్రకటించనుంది.
ఇతరులకన్నా ముందుగా ఈ కారును రిజర్వ్ చేసుకోవాలనుకునే వారు మే 9నుంచి కియా అధికారిక వెబ్‌సైట్ లేదా డీలర్‌షిప్‌ల వద్ద రూ.25,000 బుకింగ్ మొత్తాన్ని చెల్లించి బుకింగ్ చేయవచ్చు.