LOADING...
Kia: కియా నూతన ఎలక్ట్రిక్ కారు.. ఒక్క ఛార్జ్‌తో 400 కి.మీ రేంజ్!
కియా నూతన ఎలక్ట్రిక్ కారు.. ఒక్క ఛార్జ్‌తో 400 కి.మీ రేంజ్!

Kia: కియా నూతన ఎలక్ట్రిక్ కారు.. ఒక్క ఛార్జ్‌తో 400 కి.మీ రేంజ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 12, 2025
03:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత మార్కెట్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో కియా సైరోస్ ఈవీ ఒకటి. ప్రస్తుతం కియా ఈ మోడల్‌ను అభివృద్ధి చేస్తోంది. తాజాగా పూర్తిగా కవర్ చేసిన టెస్ట్ మోడల్ మొదటిసారిగా ఒక ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌లో ఛార్జింగ్ అవుతుండగా గుర్తించారు. కారు పూర్తిగా కప్పివున్నప్పటికీ, దానిలోని ప్రధాన డిజైన్ అంశాలు స్పష్టంగా కనిపించాయి. డిజైన్ & ఫీచర్లు కారు నిటారుగా ఉండే బాడీ స్టైల్, బాక్సీ ఆకారం దీన్ని ఒక ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా నిర్ధారిస్తోంది. స్టాండర్డ్ కియా సైరోస్ డిజైన్‌ను ఇది అనుసరిస్తుందని భావిస్తున్నారు. కియా క్యారెన్స్ క్లావిస్ ఈవీ మాదిరిగానే, సైరోస్ ఈవీ కూడా పెట్రోల్ వర్షన్ డిజైన్‌ను కొనసాగించనుంది.

Details

మెరుగైన ఫీచర్లు

ప్రత్యేక డిజైన్ ఎలిమెంట్స్‌లో స్క్వేర్ ఆకార వీల్ ఆర్చెస్, షార్ట్ ఓవర్‌హాంగ్స్, పొడవైన గ్లాస్‌హౌస్, అలాగే కియా బ్రాండింగ్‌తో ఉన్న ఏరో-స్టైల్ వీల్స్ ఉన్నాయి. ఇవి కారు సామర్థ్యాన్ని, ఏరోడైనమిక్స్‌పై దృష్టి పెట్టినట్లు సూచిస్తున్నాయి. బంపర్ అంచుల వద్ద వర్టికల్ హెడ్‌ల్యాంప్స్, టెయిల్‌గేట్ ఇరువైపులా నిలువుగా ఉండే టెయిల్‌లైట్లు దీన్ని మరింత ప్రత్యేకంగా చూపిస్తున్నాయి. ఫ్లాట్ రూఫ్‌లైన్, నిటారుగా ఉండే టెయిల్‌గేట్ దీని SUV లుక్‌ను బలోపేతం చేస్తున్నాయి. ముఖ్యంగా, ఛార్జింగ్ పోర్ట్‌ను కారు ఎడమ ముందు ఫెండర్‌పై అమర్చడం, క్యారెన్స్ క్లావిస్ ఈవీ తరహాలో కాకుండా ప్రత్యేకతను ఇస్తోంది.

Details

రేంజ్ & మార్కెట్ పొజిషనింగ్ 

ఈ కొత్త కియా సైరోస్ ఈవీ రాబోయే నెలల్లో అంతర్జాతీయంగా లాంచ్ కానుంది. భారతదేశంలో ఇది కియా క్యారెన్స్ క్లావిస్ ఈవీ కంటే తక్కువ ధరలో అందుబాటులోకి రానుందని అంచనా. సాంకేతిక వివరాలు ఇంకా వెల్లడించకపోయినా, పలు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. టాప్-ఎండ్ మోడల్ ఒకే ఛార్జింగ్‌తో 300-400 కి.మీ. రేంజ్ ఇస్తుందని ఊహిస్తున్నారు. కియా సైరోస్ ఇప్పటికే భారత ప్యాసింజర్ కార్ల మార్కెట్‌లో విశ్వసనీయ ఫ్యామిలీ కారు ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. దీని ఎలక్ట్రిక్ వెర్షన్ విడుదలతో అమ్మకాలు మరింత పెరుగుతాయని కియా నమ్ముతోంది.