Kia EV2 : 448 కి.మీ రేంజ్‌తో దూసుకొచ్చిన కియా కొత్త ఎలక్ట్రిక్ కారు.. ధర కూడా తక్కువే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రఖ్యాత వాహన తయారీ సంస్థ కియా మోటార్స్ మరోసారి ఎలక్ట్రిక్ వాహన రంగంలో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం బ్రస్సెల్స్‌లో జరుగుతున్న మోటార్ షో లో తన సరికొత్త ఎలక్ట్రిక్ క్రాస్‌ఓవర్ 'కియా ఈవీ2 (EV2) ను అధికారికంగా ఆవిష్కరించింది. కియా నుంచి విడుదలైన అత్యంత చిన్నదైన, అత్యంత సరసమైన గ్లోబల్ ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం విశేషం. గ్లోబల్ మార్కెట్‌లో ఇది రెనాల్ట్ 4, ఫోక్స్‌వ్యాగన్ ఐడీ క్రాస్ వంటి మోడళ్లకు గట్టి పోటీగా నిలవనుంది.
Details
కియా EV2 డిజైన్: బాక్సీ లుక్.. స్టైలిష్ ఆకృతి
కియా తన ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు EV6, EV9 నుంచి ప్రేరణ పొంది EV2ను డిజైన్ చేసింది. కియా సిగ్నేచర్ అయిన 'టైగర్ ఫేస్' ఫ్రంట్ లుక్, బాక్సీ షేప్ ఈ కారుకు ప్రత్యేకమైన గుర్తింపును అందించాయి. హెడ్‌ల్యాంప్స్ నిలువుగా ఉండే స్ప్లిట్ హెడ్‌ల్యాంప్స్ కారుకు యూనిక్, ఫ్యూచరిస్టిక్ లుక్‌ను ఇస్తాయి. వీల్స్ సాధారణ వేరియంట్లలో 16 నుంచి 18 అంగుళాల వీల్స్ అందించగా, స్పోర్టీ GT లైన్ వేరియంట్‌లో 19 అంగుళాల అలాయ్ రిమ్స్ ఉన్నాయి. కొలతలు కారు పొడవు 4,060 ఎంఎం, వెడల్పు 1,800 ఎంఎం. కాంపాక్ట్ సైజ్ ఉన్నప్పటికీ, లోపలి భాగంలో విశాలమైన స్పేస్‌ను అందిస్తుంది.
Details
కియా EV2 ఇంటీరియర్: టెక్నాలజీతో కూడిన 'పిక్నిక్ బాక్స్' అనుభూతి
ఈ ఎలక్ట్రిక్ కారు ఇంటీరియర్‌ను కియా 'పిక్నిక్ బాక్స్' థీమ్ తో రూపొందించింది. ఇది ప్రయాణికులకు ప్రశాంతమైన, వ్యక్తిగత స్పేస్‌లా అనిపించేలా డిజైన్ చేశారు. భారత్‌లో ఇటీవల విడుదలైన 'కియా సైరోస్' తరహా ఇంటీరియర్ స్టైల్ ఇందులో కనిపిస్తుంది. డిజిటల్ డ్యాష్‌బోర్డ్: ఇందులో మొత్తం మూడు స్క్రీన్లు ఉంటాయి 12.3 అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ 5.3 అంగుళాల క్లైమేట్ కంట్రోల్ డిస్‌ప్లే 12.3 అంగుళాల ప్రధాన టచ్‌స్క్రీన్
Details
ఫ్లెక్సిబిలిటీ
సాధారణ 5-సీటర్‌తో పాటు, 4-సీటర్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంటుంది. 4-సీటర్ వెర్షన్‌లో వెనుక సీట్లను ముందుకు జరపడం ద్వారా 403 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. ఫీచర్లు హర్మాన్ కార్డాన్ ప్రీమియం ఆడియో సిస్టమ్, లెవల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) డిజిటల్ కీ 2.0 వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. కియా EV2: బ్యాటరీ, రేంజ్ వివరాలు కియా EV2 రెండు బ్యాటరీ ఆప్షన్లలో అందుబాటులోకి వస్తోంది. స్టాండర్డ్ రేంజ్ వేరియంట్ 42.2 కిలోవాట్ అవర్ బ్యాటరీ గరిష్టంగా 317 కి.మీ రేంజ్ 147 హెచ్‌పీ ఎలక్ట్రిక్ మోటార్
Details
లాంగ్ రేంజ్ వేరియంట్
61.0 కిలోవాట్ అవర్ బ్యాటరీ గరిష్టంగా 448 కి.మీ రేంజ్ 136 హెచ్‌పీ మోటార్ ఛార్జింగ్ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 30 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. అలాగే వాహనం నుంచి ఇతర ఎలక్ట్రిక్ పరికరాలకు విద్యుత్ అందించే V2L (వెహికిల్ టు లోడ్ టెక్నాలజీ కూడా ఇందులో ఉంది.
Details
ధర, ఇండియా లాంచ్ వివరాలు
కియా EV2ను చౌకైన ఎలక్ట్రిక్ కారుగా ప్రచారం చేస్తున్నప్పటికీ, అధికారిక ధరలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే యూరోప్ మార్కెట్‌లో దీని ప్రారంభ ఎక్స్‌షోరూం ధర సుమారు 26,000 యూరోలు (దాదాపు రూ. 31 లక్షలు) ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్‌లో EV2 లాంచ్‌పై కియా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఒకవేళ లాంచ్ అయితే, ఇండియన్ మార్కెట్‌లో టాటా పంచ్ EV, టాటా నెక్సాన్ EV, సిట్రోయెన్ eC3 వంటి ఎలక్ట్రిక్ కార్లకు ఇది గట్టి పోటీగా మారనుంది.