Electric scooter : కోమాకి వెనిస్.. ఫ్యామిలీ సేఫ్టీకి ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్!
ఇండియన్ ఆటో మొబైల్ మార్కెట్‌లో 2 వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ ట్రెండ్‌ను క్యాష్ చేసుకోవడానికి ఆటోమొబైల్ కంపెనీలు కొత్త మోడల్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ కోసం రూపొందించిన ఈవీలు కూడా మంచి ఆదరణను పొందుతున్నాయి. ఈ క్రమంలో కోమాకి సంస్థ రూపొందించిన వెనిస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కి ప్రాధాన్యం పెరిగింది. ఈ స్కూటర్‌కి తాజాగా తీసుకువచ్చిన అప్‌గ్రేడ్ వర్షన్ మరింత ఫ్యామిలీ సేఫ్టీని అనుసరిస్తూ, మార్కెట్‌లో గట్టి పోటీని ఎదుర్కొంటోంది. కోమాకి తన ఫ్యామిలీ-సేఫ్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ వెనిస్‌ను రూ.1,67,500 ధరతో రిలీజ్ చేశారు. ఈ అప్‌గ్రేడ్ మోడల్‌లో అదనపు భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
కేవలం నాలుగు గంటల్లో 90శాతం ఛార్జింగ్
ఇందులో ఉపయోగించే డిటాచబుల్ LiFePO4 బ్యాటరీలు ఈ స్కూటర్‌కు హైలైట్‌గా నిలుస్తున్నాయి. ఈ బ్యాటరీలు మంటలకు వ్యతిరేకంగా, ఫైర్ రెసిస్టెంట్‌గా డిజైన్ చేశారు. ఈ స్కూటర్‌కి ఛార్జింగ్ విషయంలో కూడా శక్తివంతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్‌ను ఐదు గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. పోర్టబుల్ ఛార్జర్లత, కేవలం నాలుగు గంటల్లో స్కూటర్‌ను 90శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఇందులో అల్ ట్రా-బ్రైట్ LED లైటింగ్ సిస్టమ్, 3,000 వాట్ హబ్ మోటార్ / 50 ఏఎమ్‌పీ కంట్రోలర్, 3 గేర్ మోడ్‌లు: ఎకో, స్పోర్ట్, టర్బో, రివర్స్ మోడ్, సూపర్ స్ట్రాంగ్ స్టీల్ ఫ్రేమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే వంద కిలోమీటర్లు
వెనిస్ స్పోర్ట్ క్లాసిక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒకసారి ఛార్జ్ చేస్తే 75 నుంచి 100 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. వెనిస్ స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్ మోడల్ రూ.1,49,757 (ఎక్స్-షోరూమ్) ధర ఉంది. ఇది 200 కిలోమీటర్ల పరిధి అందిస్తుంది, వెనిస్ అల్ట్రా స్పోర్ట్ రూ.1,67,500 (ఎక్స్-షోరూమ్) ధరతో వస్తుంది, ఇది కూడా 80 కిమీ/గంటకు వేగంతో 200 కిలోమీటర్ల పరిధి అందిస్తుంది.