Page Loader
వావ్.. సరికొత్త లేటెస్ట్ ఫీచర్లతో క్రియాన్ ఎలక్ట్రికల్ స్కూటర్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే?
సరికొత్త లేటెస్ట్ ఫీచర్లతో క్రియాన్ ఎలక్ట్రికల్ స్కూటర్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే?

వావ్.. సరికొత్త లేటెస్ట్ ఫీచర్లతో క్రియాన్ ఎలక్ట్రికల్ స్కూటర్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 15, 2023
12:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియాలో ఈవీ సెగ్మెంట్‌ను లాంచ్ చేసేందుకు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలన్నీ పోటీపడుతున్నారు. ముఖ్యంగా టూ వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్‌లో విపరీతమైన పోటీ కనిపిస్తోంది. ఈ దశలో టీవీఎస్ మోటర్స్ క్రియోన్ ఎలక్ట్రికల్ స్కూటర్‌కు సంబంధించి కీలక ఫీచర్లను వెల్లడించింది. ఆగస్ట్ 23న దుబాయ్‌లో జరిగే ఓ కార్యక్రమంలో టీవీఎస్ మోటర్స్ క్రియాన్ ఎలక్ట్రికల్ వెహికల్‌కు సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేయనుంది. ఈ ఎలక్ట్రికల్ స్కూటర్ ఏథర్ 450S, ఓలా ఎస్ 1 ఎయిర్ వంటి వాటితో పోటీ పడనుంది. క్రియాన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో LED హెడ్‌లైట్, షార్ప్ ఆప్రాన్ ప్యానెల్స్ వంటి ఆధునిక ఫీచర్లు ఉండనున్నాయి. ఈ వెహికల్‌ను స్మార్ట్ వాచ్‌కు లింక్ చేసే అవకాశాన్ని కల్పించింది.

Details

ఒక్కసారి ఛార్జ్ చేస్తే వంద కిలోమీటర్ల ప్రయాణం 

స్మార్ట్ వాచ్ ఆధారంగా ఈ స్కూటర్ లాక్ అన్ చేయడం, ఆఫ్ చేయడం వంటివి చేయోచ్చని ఆ వీడియోలో టాటా మోటర్స్ స్పష్టం చేసింది. క్రియాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ గురించి ఆ సంస్థ ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఈ వెహికల్ కేవలం 5.1 సెకండ్ల వ్యవధిలోనే జీరో నుంచి 60 కి.మీ వేగాన్ని అందుకోగలదని టీవీఎస్ తెలిపింది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు వంద కిలోమీటర్ల ప్రయాణిస్తుందని, అదే విధంగా 90 కిలోమీటర్ల వేగంతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వెళుతుందని టీవీఎస్ మోటర్స్ పేర్కొంది. క్రియాన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రాబోవు పండుగలను దృష్టిలో ఉంచుకొని లాంచ్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.