LOADING...
Lexus RX 350h: భారత మార్కెట్లోకి లెక్సస్ RX 350h Exquisite.. ధర రూ. 89.99 లక్షలు
భారత మార్కెట్లోకి లెక్సస్ RX 350h Exquisite.. ధర రూ. 89.99 లక్షలు

Lexus RX 350h: భారత మార్కెట్లోకి లెక్సస్ RX 350h Exquisite.. ధర రూ. 89.99 లక్షలు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 04, 2025
12:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత మార్కెట్లో లెక్సస్ తమ లగ్జరీ SUV శ్రేణిని విస్తరిస్తూ RX 350h కు కొత్త'Exquisite'వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ మోడల్ ధరను రూ. 89.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఆధునిక హైబ్రిడ్ టెక్నాలజీకి కట్టుబడి ఉంటూనే, మరింత అధునాతన ఫీచర్లను, ప్రీమియం ఎక్విప్మెంట్‌ను అందిస్తూ ఈ వేరియంట్ RX లైనప్‌కు అదనపు విలువను చేకూరుస్తోంది. RX 350h Exquisite‌లో సాధారణ లెక్సస్ ఆడియో సిస్టమ్‌తో పాటు ఆప్షన్‌గా మార్క్ లెవిన్‌సన్ ప్రీమియం ఆడియో ప్యాక్ కూడా ఉంటుంది. ఇందులో 2.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌కు హై-అవుట్‌పుట్ ఎలక్ట్రిక్ మోటార్‌,నికెల్ మెటల్ హైడ్రైడ్ బ్యాటరీతో కూడిన లెక్సస్ సెల్ఫ్-చార్జింగ్ హైబ్రిడ్ సిస్టమ్ పనిచేస్తుంది,ఇది మెరుగైన మైలేజ్‌తో పాటు స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది.

వివరాలు 

క్యాబిన్ లోపల ఒక లుక్ 

భారత్‌లో పెర్ఫామెన్స్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ లగ్జరీ SUVగా ప్రత్యేక గుర్తింపు ఉన్న RX,టర్బోచార్జ్డ్ఇంజిన్‌, ఎలక్ట్రిక్ మోటార్‌,ఆరు-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌,రియర్ e-యాక్సిల్ వంటి ఫీచర్లతో ఉన్న 2.4 లీటర్ టర్బో-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉంది. అలాగే డైనమిక్ రియర్-వీల్ స్టీరింగ్,DIRECT4 ఆల్-వీల్ డ్రైవ్ టెక్నాలజీ వల్ల రోడ్డుపై మెరుగైన స్థిరత్వం,చురుకుదనం లభిస్తాయి. కేబిన్‌లో 10-వే పవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు,రెండు వరుసలకు హీటెడ్‌,వెంటిలేటెడ్ సీటింగ్‌, అంబియంట్ లైటింగ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. అవసరమైతే 21-స్పీకర్ మార్క్ లెవిన్‌సన్ ఆడియో సిస్టమ్ ఏర్పాటు చేయవచ్చు. భద్రత కోసం ఇందులో లెక్సస్ సేఫ్టీ సిస్టమ్+భాగంగా డైనమిక్ రాడార్ క్రూస్ కంట్రోల్,బ్లైండ్ స్పాట్ మానిటర్,క్రాస్ ట్రాఫిక్ అలర్ట్,సేఫ్ ఎగ్జిట్ అసిస్ట్ వంటి ఆధునిక ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Advertisement