Page Loader
Mahindra:'6ఈ' ట్రేడ్‌మార్క్ వివాదంలో మహీంద్రా కీలక నిర్ణయం.. 'బీఈ 6' పేరును ఎంచుకున్నట్లు ప్రకటన
6ఈ' ట్రేడ్‌మార్క్ వివాదంలో మహీంద్రా కీలక నిర్ణయం.. 'బీఈ 6' పేరును ఎంచుకున్నట్లు ప్రకటన

Mahindra:'6ఈ' ట్రేడ్‌మార్క్ వివాదంలో మహీంద్రా కీలక నిర్ణయం.. 'బీఈ 6' పేరును ఎంచుకున్నట్లు ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 07, 2024
06:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

విద్యుత్‌ వాహన రంగంలో మహీంద్రా అండ్‌ మహీంద్రా వేగంగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల తన తాజా మోడల్‌ పేరు మార్పు నిర్ణయం తీసుకుంది. 'బీఈ 6ఈ' పేరిట విడుదల చేసిన ఈ వాహనానికి సంబంధించి ట్రేడ్‌మార్క్‌ వివాదం నేపథ్యంలో ఈ పేరు 'బీఈ 6'గా మార్చినట్లు సంస్థ ప్రకటించింది. ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ (ఇండిగో)తో '6ఈ' ట్రేడ్‌మార్క్‌ ఉల్లంఘన అంశం కోర్టు వరకు వెళ్లడంతో ఈ వివాదం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో మహీంద్రా తమ కస్టమర్లకు అడ్డంకులు లేకుండా మరింత మెరుగైన సేవలను అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తమ వినియోగదారుల కోసం ఉత్తమమైన ఉత్పత్తులు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొంది.

Details

ఇండిగో ఆరోపణలను ఖండించిన మహీంద్రా

అందుకే ఈ వివాదాన్ని సానుకూలంగా పరిష్కరించడానికి ముందు ముందడుగు వేశామని మహీంద్రా తెలిపింది. అయితే ఇండిగో చేస్తున్న ఆరోపణలను నిరాధారమైనవిగా ఖండించిన సంస్థ, కోర్టు ముందూ తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ వివాదం గురించి రెండు సంస్థలు పరోక్షంగా వ్యాఖ్యానించినప్పటికీ, మహీంద్రా తన వాహన పేరు మార్చడం ద్వారా అనవసరమైన గొడవలు నివారించడానికి ప్రయత్నించింది. ఈ మార్పుతో సంస్థ తమ వ్యాపార దృష్టిని మరింత మెరుగుపరచుకోగలదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ వివాదం ముగింపుతో మహీంద్రా కొత్త పేరుతో విద్యుత్‌ వాహనాన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది.