Page Loader
మరో 5 వేరియంట్లను విడుదల చేయనున్న మహీంద్రా స్కార్పియో-ఎన్
కొన్ని వేరియంట్ల డెలివరీకి ఎక్కువ సమయం పట్టచ్చు

మరో 5 వేరియంట్లను విడుదల చేయనున్న మహీంద్రా స్కార్పియో-ఎన్

వ్రాసిన వారు Nishkala Sathivada
Dec 28, 2022
10:35 am

ఈ వార్తాకథనం ఏంటి

స్వదేశీ ఆటో మొబైల్ సంస్థ మహీంద్రా & మహీంద్రా స్కార్పియో-ఎన్ లైనప్‌లో ఎంట్రీ లెవల్ నుండి మిడ్-స్పెక్ వరకు ఐదు కొత్త వేరియంట్‌లను విడుదల చేయనుంది. SUVలో ఇప్పుడు ఇంజిన్ (పెట్రోల్/డీజిల్), ట్రాన్స్‌మిషన్ (మాన్యువల్/ఆటోమేటిక్), సీటింగ్ (ఆరు/ఏడు) ఆప్షన్స్ బట్టి 30 రకాల వేరియంట్‌లు ఉన్నాయి. ఈ ఐదు కొత్త వేరియంట్‌లు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందించబడుతున్నాయి. అయితే, 4WD ఆప్షన్ ఉంది. మొత్తం ఐదు కొత్త వేరియంట్‌లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఉంది. Z2లో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, AC వెంట్లు, LED టెయిల్ ల్యాంప్స్, LED టర్న్ ఇండికేటర్లు, పెంటాలింక్ సస్పెన్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. Z4, Z4 4WDలో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే ఉంది.

మహీంద్రా స్కార్పియో

కొత్త వేరియంట్ల ధర 12.49 లక్షల నుండి 16.94 లక్షల వరకు ఉంది

మొత్తం మహీంద్రా స్కార్పియో-ఎన్ శ్రేణి ధర రూ. 11.99 లక్షల నుండి రూ. 23.90 లక్షల మధ్య ఉండగా, ఈ ఐదు కొత్త వేరియంట్‌లు ధరలు ఇలా ఉన్నాయి Z2 G MT E (పెట్రోల్), - రూ. 12.49 లక్షలు Z2 D MT E(డీజిల్), - రూ. 12.99 లక్షలు Z4 G MT E (పెట్రోల్)- రూ. 13.99 లక్షలు Z4 D MT E(డీజిల్) - రూ. 14.49 లక్షలు Z4 D MT 4WD E (డీజిల్)- రూ. 16.94 లక్షలు