Mahindra : నవంబర్ 26 ముందు మహీంద్రా BE 6 రేసింగ్ ఎడిషన్ లుక్ ఔట్
ఈ వార్తాకథనం ఏంటి
మహీంద్రా నవంబర్ 26న జరగనున్న లాంచ్‌కు ముందు రేసింగ్ స్టైల్‌తో రూపొందించిన BE 6స్పెషల్ ఎడిషన్‌ను టీజ్ చేసింది. బెంగళూరులో 26,27 తేదీల్లో జరిగే Scream Electric ఈవెంట్‌లో ఈ మోడల్‌ను అధికారికంగా పరిచయం చేయనుంది. ఇదే కార్యక్రమంలో కంపెనీ తన మూడో ఎలక్ట్రిక్ SUV XEV 9Sను రిలీజ్ చేయడంతో పాటు మరొక కొత్త EVను కూడా అన్‌వీల్ చేయబోతున్నట్లు తెలిపింది. విడుదల చేసిన టీజర్‌లో ఫైర్‌స్టార్మ్ ఆరెంజ్ షేడ్లో కనిపించే స్పెషల్ ఎడిషన్ BE 6,ప్యాక్-టూ లుక్‌తో సింపుల్ LED DRL సిగ్నేచర్‌ను చూపిస్తోంది. "Winning Formula"ని చూడండి అని మహీంద్రా ప్రేక్షకులను కోరడం చూస్తే,ఈ కొత్త వెర్షన్‌ను Formula Edition లేదా Racing Editionపేరుతో తీసుకురావొచ్చనే సూచనలు తెలుస్తున్నాయి.
వివరాలు
మహీంద్రా ఫార్ములా-E రేసింగ్ వారసత్వానికి ట్రిబ్యూట్
ఈ మోడల్, మహీంద్రా ఫార్ములా-E రేసింగ్ వారసత్వానికి ట్రిబ్యూట్‌గా వచ్చిన అవకాశం ఎక్కువ. ఫార్ములా-E ప్రారంభం నుంచి పాల్గొంటున్న మహీంద్రా, తాజాగా ముగిసిన సీజన్-11లో నిక్ డి వ్రీస్, ఎడువార్డో మోర్టారా ప్రదర్శనతో టీమ్ చాంపియన్‌షిప్‌లో 186 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. BE 6 రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తోంది. 59kWh, 79kWh. చిన్న బ్యాటరీ 228hp పవర్ ఇస్తే,పెద్దది 282hp శక్తిని రియర్ వీల్స్‌కు పంపుతుంది. టాప్ వెర్షన్ 0-100km/h వేగాన్ని కేవలం 6.7 సెకన్లలో అందుకుంటుంది. రేంజ్, ఎవ్రిడే, రేస్ అనే మూడు డ్రైవ్ మోడ్‌లతో పాటు, కొద్ది సమయంలో గరిష్ట శక్తిని ఇచ్చే Boost Mode కూడా అందుబాటులో ఉంది.