మహీంద్రా థార్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీపై కీలక అప్డేట్.. ఎప్పుడు వస్తుందంటే?
ఆటో మొబైల్ మార్కెట్‌లో మహీంద్రా థార్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ వేరియంట్ లాంచ్ చేసినా దానికి ఫుల్ డిమాండ్ ఏర్పడుతుంది. ఇప్పటికే థార్ ఈవీ వస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. దానికి 'థార్.ఈ' అని పేరు కూడా సంస్థ పెట్టింది. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ థార్ అత్యాధునిక INGLO ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించనున్నారు. Thar.e ఓ అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది, ఇందులో ఇంటిగ్రేటెడ్ DRLలతో కూడిన స్క్వేర్డ్ LED హెడ్‌లైట్‌లు, ముందు, వెనుక బలమైన బంపర్లు వంటివి ఉన్నాయి. లోపల టచ్‌స్క్రీన్, పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ ఫీచర్స్‌తో రానుంది.
2026లో మార్కెట్లోకి మహీంద్రా 'థార్ ఈ'
మహీంద్రా థార్ ఈ ICE వెర్షన్‌ను అధిగమిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎలక్ట్రిక్ SUV డ్యూయల్ మోటార్ సెటప్‌తో 3-డోర్, 5-డోర్ కాన్ఫిగరేషన్‌లలో రానుంది. తాజాగా మహీంద్రా థార్ ఎలక్ట్రికల్ నుంచి ఓ కీలక ఆప్డేట్ బయటికొచ్చింది. దీని కోసం చాలా నెలలు ఓపిక పట్టాలని సంస్థ చెబుతోంది. ఆటోమేకర్ తన ప్రస్తుత ICE, SUVలను విద్యుదీకరించాలని భావిస్తోంది, అదే సమయంలో సరికొత్త ఎలక్ట్రిక్ మోడళ్లను కూడా విడుదల చేస్తుంది. Thar.e 2026 లేదా బహుశా 2027లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.