Loading...
Mahindra: మహీంద్రా థార్‌ రాక్స్‌లో భారీ అప్‌డేట్‌.. ఇక ప్రయాణం మరింత సౌకర్యం!
మహీంద్రా థార్‌ రాక్స్‌లో భారీ అప్‌డేట్‌.. ఇక ప్రయాణం మరింత సౌకర్యం!

Mahindra: మహీంద్రా థార్‌ రాక్స్‌లో భారీ అప్‌డేట్‌.. ఇక ప్రయాణం మరింత సౌకర్యం!

వ్రాసిన వారు Balachander Sharma
Nov 13, 2026
04:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహీంద్రా థార్‌ రాక్స్‌ కొనుగోలుదారులకు త్వరలో మరో శుభవార్త అందే అవకాశం ఉంది. ఈ ఐదు డోర్ల ఎస్‌యూవీలో డావిన్సీ సస్పెన్షన్‌ టెక్నాలజీని ప్రవేశపెట్టేందుకు మహీంద్రా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మూడు డోర్ల థార్‌లో ఇప్పటికే ఉపయోగిస్తున్న ఈ సాంకేతికతను కొత్త మోడల్‌లోనూ అందిస్తే గుంతలు, ఎగుడుదిగుడు రోడ్లపై ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది. లాంచ్‌ తర్వాత థార్‌ రాక్స్‌కు ఇది తొలి ప్రధాన మెకానికల్‌ అప్‌డేట్‌ కానుంది.

Details

థార్‌ రాక్స్‌లో సస్పెన్షన్‌ మార్పులు

ప్రస్తుతం థార్‌ రాక్స్‌ ముందు భాగంలో డబుల్‌ విష్‌బోన్‌ సస్పెన్షన్‌, వెనుకవైపు వాట్స్‌ లింకేజ్‌తో కూడిన పెంటాలింక్‌ సెటప్‌ను ఉపయోగిస్తున్నారు.

రెండు వైపులా ఫ్రీక్వెన్సీ డిపెండెంట్‌ డ్యాంపింగ్‌ (FDD) వ్యవస్థ ఉంది. కొత్త అప్‌డేట్‌లో ఈ నిర్మాణాన్ని పూర్తిగా మార్చకుండా, DCx వాల్వ్‌లతో కూడిన డావిన్సీ టెక్నాలజీని జోడించే అవకాశం ఉంది.

Details

డావిన్సీ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది?

ఈ వ్యవస్థలో ప్రత్యేకమైన పిస్టన్‌ వాల్వ్‌లు, పలుచని మెటల్‌ డిస్కులు ఉంటాయి.

సస్పెన్షన్‌లోకి వచ్చే ఒత్తిడిని బట్టి ఇవి కదులుతూ డ్యాంపర్‌లోని ఆయిల్‌ ప్రవాహాన్ని నియంత్రిస్తాయి.

ఫలితంగా రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా సస్పెన్షన్‌ స్పందిస్తుంది.

తక్కువ ఫ్రీక్వెన్సీతో వచ్చే వాహన కదలికలను DCx వాల్వ్‌లు నియంత్రిస్తే, చిన్న గుంతలు, ఆకస్మిక కుదుపుల వంటి అధిక ఫ్రీక్వెన్సీ కదలికలను రైడ్‌ రిఫైన్‌ RC1 వాల్వ్‌లు నిర్వహిస్తాయి.

ADVERTISEMENT

Details

సిటీ ప్రయాణాల్లోనూ మెరుగైన అనుభూతి

ఈ టెక్నాలజీ మొదట 2026 జనవరిలో XUV 7XOలో పరిచయమైంది. ఆ తర్వాత అప్‌డేటెడ్‌ మూడు డోర్ల థార్‌లోనూ అందుబాటులోకి వచ్చింది.

అదే సెటప్‌ థార్‌ రాక్స్‌కు వస్తే తక్కువ వేగంతో ప్రయాణించేటప్పుడు, గుంతలు దాటేటప్పుడు కుదుపులు తగ్గే అవకాశం ఉంది.

రోజువారీ నగర ప్రయాణాల్లోనూ ఎస్‌యూవీ మరింత సౌకర్యవంతంగా మారవచ్చు.

ADVERTISEMENT

Details

ఇంజిన్‌లో మార్పులు ఉండకపోవచ్చు

ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ అప్‌డేట్‌ ప్రధానంగా సస్పెన్షన్‌కే పరిమితం కానుంది. ఇంజిన్‌, గేర్‌బాక్స్‌ ఆప్షన్లలో మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది.

అయితే మహీంద్రా ఈ మార్పులపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

కొత్త సస్పెన్షన్‌ అందుబాటులోకి వస్తే థార్‌ రాక్స్‌ రైడ్‌ కంఫర్ట్‌ విషయంలో మరింత ఆకర్షణీయమైన ఎంపికగా నిలిచే అవకాశం ఉంది.

ADVERTISEMENT