Mahindra 'Vision S': మహీంద్రా 'విజన్ ఎస్' లాంచ్.. 2027లో స్కార్పియో ఫ్యామిలీకి కొత్త అదనపు ఎస్‌యూవీ!
ఈ వార్తాకథనం ఏంటి
ఎస్‌యూవీల రారాజు మహీంద్రా మరో సంచలనముగా 'విజన్ ఎస్' రోడ్లపైకి రానుంది. గత ఏడాది ఆగస్టులో 'ఫ్రీడమ్_ఎన్.యూ' ఈవెంట్‌లో ప్రదర్శించిన నాలుగు కాన్సెప్ట్ ఎస్‌యూవీలలో ఒకటైన 'విజన్ ఎస్' ప్రస్తుతం తమిళనాడులో టెస్టింగ్‌లో ఉంది. కొన్ని స్పై ఫోటోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ రెడిట్‌లో పోస్టవ్వడం ద్వారా ఈ మోడల్‌కు సంబంధించిన కొత్త విషయాలు బయటపడ్డాయి. మహీంద్రా గత ఆగస్టులో పరిచయం చేసిన నాలుగు కాన్సెప్ట్ ఎస్‌యూవీలు: విజన్ ఎస్, విజన్ ఎస్ఎక్స్టీ, విజన్.టీ, విజన్.ఎక్స్. వీటన్నీ 'ఫ్రీడమ్_ఎన్.యూ' మోనోకాక్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడ్డాయి. ఈ ప్లాట్‌ఫామ్‌లో పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ ఇంజిన్లను అమర్చే సౌలభ్యం ఉంది. ముఖ్యంగా 'విజన్ ఎస్' స్కార్పియో ఫ్యామిలీకి చెందిన సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీగా రాబోతోంది.
Details
'ఎల్' ఆకారపు లైట్ల స్థానంలో గుండ్రని హెడ్‌ల్యాంప్
స్కార్పియో-ఎన్‌కు బుడ్డి వర్షన్‌గా వస్తుంది. ఇప్పటి స్కార్పియో-ఎన్ లేదా క్లాసిక్ లాగా ఇది లాడర్-ఫ్రేమ్ ఛాసిస్‌కి బదులుగా మోనోకాక్ ప్లాట్‌ఫామ్‌లో తయారు అవుతోంది, పొడవు 4 మీటర్ల కన్నా తక్కువగా ఉంటుంది. స్పై షాట్ల ప్రకారం, టెస్టింగ్ కారులో కాన్సెప్ట్ మోడల్ బాక్సీ డిజైన్ కొనసాగించబడింది. వెనుక భాగంలో స్టెపినీ (స్పేర్ వీల్) అమర్చారు, స్కార్పియో సిరీస్ గుర్తింపును ప్రతిబింబిస్తుంది. కాన్సెప్ట్‌లో ఉన్న 'ఎల్' ఆకారపు లైట్ల స్థానంలో గుండ్రని హెడ్‌ల్యాంప్‌లను ఉపయోగించారు. ఇంటీరియర్ వివరాలు ఇంకా అందుబాటులో లేవు, కాన్సెప్ట్ మోడల్ ప్రకారం టెక్-ఫోకస్డ్, డ్యూయెల్ టచ్ స్క్రీన్లతో క్యాబిన్ ఉండనుందని అంచనా.
Details
2027 నాటికి షోరూమ్‌లలో లాంచ్
మహీంద్రా అధికారికంగా తెలియజేయకపోయినప్పటికీ, ప్రారంభంలో ఈ 'విజన్ ఎస్' 1.2-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో వస్తుందని తెలుస్తోంది. భవిష్యత్తులో హైబ్రిడ్, ఫుల్లీ ఎలక్ట్రిక్ వెర్షన్లను కూడా తీసుకొస్తుందని అంచనాలు. ప్రస్తుతం వివిధ రోడ్లపై టెస్టింగ్ జరుగుతుంది. అన్నీ ప్లాన్ ప్రకారం జరిగితే, 2027 నాటికి షోరూమ్‌లలో లాంచ్ అవ్వనుంది. ఈ ఎస్‌యూవీ లాంచ్ తర్వాత టాటా సియెర్రా వంటి మోడల్స్‌కు ఘట్టి పోటీ ఇవ్వనుంది.