LOADING...
Mahindra XEV 9S: భారత మార్కెట్లో మహీంద్రా XEV 9S లాంచ్.. ప్రారంభ ధర ₹19.95 లక్షలు 
ప్రారంభ ధర ₹19.95 లక్షలు

Mahindra XEV 9S: భారత మార్కెట్లో మహీంద్రా XEV 9S లాంచ్.. ప్రారంభ ధర ₹19.95 లక్షలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 27, 2025
11:44 am

ఈ వార్తాకథనం ఏంటి

మహీంద్రా తన కొత్త ఎలక్ట్రిక్ SUV XEV 9S ను భారత మార్కెట్లో అధికారికంగా పరిచయం చేసింది. కొత్త మోడల్ ధరను కంపెనీ ₹19.95 లక్షల (ఎక్స్-షోరూమ్)గా ప్రకటించింది. ప్రీమియం ఈవీ సెగ్మెంట్‌లో XEV 9e కంటే కూడా ఈ మోడల్,ప్రత్యేకంగా రూపొందించిన INGLO ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. ఈ వాహనంలో క్యాబిన్ స్పేస్‌ను పెంచడంపై దృష్టి పెట్టడంతో పాటు, ఆధునిక టెక్నాలజీ ఫీచర్లు, సౌకర్యవంతమైన సీటింగ్ వంటి అంశాలను అందించారు. '9S'లోని "S" అంటే Space అని కంపెనీ చెబుతోంది.క్లాస్‌లోనే ఎక్కువ ఇంటీరియర్ స్పేస్, ప్రాక్టికల్ డిజైన్ ఇవే ఈ మోడల్ ముఖ్య ఆకర్షణలు. మొత్తం క్యాబిన్ వాల్యూమ్ 3,941 లీటర్లు, బూట్ స్పేస్ 527 లీటర్లు,ఫ్రంట్ స్టోరేజ్ (ఫ్రంక్) 150లీటర్లుగా ఉంది.

వివరాలు 

రియర్ ప్రయాణికుల కోసం ప్రత్యేక బాస్ మోడ్

రెండో వరుసను స్లైడ్ చేసే విధంగా,రిక్లైనింగ్ సీట్లు, వెంటిలేటెడ్ సీటింగ్ ఆప్షన్లు, అలాగే రియర్ ప్రయాణికుల కోసం ప్రత్యేక బాస్ మోడ్ అందించారు. ఇంటీరియర్‌లో ట్రిపుల్-స్క్రీన్ డాష్‌బోర్డ్ సెటప్, కొత్తగా పరిచయం చేసిన MAIA AI సిస్టమ్, రెండు BYOD రియర్ ఎంటర్‌టైన్‌మెంట్ డిస్ప్లేలు,16-స్పీకర్ హర్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్,డ్రైవర్ కోసం VisionX AR హెడ్-అప్ డిస్ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. పూర్తి నిడివి కలిగిన స్కై రూఫ్, అంబియెంట్ లైటింగ్ కూడా వాహనానికి హైలైట్‌లుగా నిలుస్తాయి. బ్యాటరీ విషయానికి వస్తే, 59kWh, 70kWh, 79kWh సామర్థ్యాలతో మూడు LFP బ్యాటరీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అన్ని వేరియంట్‌లలోనూ ఒకే ఎలక్ట్రిక్ మోటర్ ఉండి, గరిష్టంగా 210kW (282hp) పవర్,380Nm టార్క్ ఇస్తుంది.

వివరాలు 

బుకింగ్స్ జనవరి 14 నుంచి

దీర్ఘ ప్రయాణాలకు అనువుగా నాలుగు డ్రైవ్ మోడ్‌లు, ఐదు రకాల రీజనరేటివ్ బ్రేకింగ్ లెవెల్స్ అందించారు. అదనంగా లెవెల్-2+ ADAS సేఫ్టీ సిస్టమ్ కూడా ఉంది. BE 6, XEV 9e కొనుగోలుదారుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా రూపొందించిన ఈ మోడల్‌ను మహీంద్రా సాధారణ ఈవీల నుంచి లగ్జరీ సెగ్మెంట్‌కు దారితీసే బ్రిడ్జ్ మోడల్‌గా ప్రమోట్ చేస్తోంది. ఈ కొత్త SUV కోసం బుకింగ్స్ జనవరి 14 నుంచి ప్రారంభం అవుతాయి. డెలివరీలు జనవరి 23, వచ్చే సంవత్సరం నుంచి మొదలుకానున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Advertisement