Mahindra XUV300 ఎస్‌యూవీలో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ మాడ్యుల్‌కు చెక్..?
మహీంద్రా సంస్థకు భారత్ ఆటో మొబైల్ రంగంలో మంచి ఆదరణ ఉన్న విషయం తెలిసిందే. దేశంలో విదేశీ సంస్థలకు గట్టిపోటీని ఇచ్చేందుకు మహీంద్ర సంస్థ తన XUV300 కారును అప్ గ్రేడ్ చేస్తోంది. సబ్-4m కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో మహీంద్రా తన మార్కెట్ విలువను పెంచుకోవాలని భావిస్తోంది. తాజాగా ఫేస్‌లిఫ్టెడ్ XUV300లో మిడ్-లెవల్ ట్రిమ్ అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) మాడ్యూల్ లేకుండా గుర్తించారు. ఈ మోడల్ 16-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది. అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) మాడ్యూల్స్ ఆధునిక వాహనాలలో ట్రాక్షన్‌ను పొందుతున్నాయి. ప్రస్తుతం, హ్యుందాయ్, VENUE మాత్రమే సబ్-4m SUV కేటగిరీలో ADASను అందిస్తోంది.
భద్రతా పరంగా 5 స్టార్ రేటింగ్ ను పొందిన XUV300 SUV
ఇందులో పెద్ద C-ఆకారంలో LED డేటైమ్ రన్నింగ్ లైట్లు (DRLలు), ప్రొజెక్టర్ సెటప్‌తో హెడ్‌లైట్లు, LED టెయిల్‌లైట్లు ఉంటాయి. అయితే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 1.2 లీటర్‌పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 110bhp శక్తి, 200Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజల్ ఇంజిన్‌లో 115bhp శక్తి, 300Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న XUV300 SUV భద్రతపరంగా గ్లోబల్ NCAP 5-స్టార్ రేటింగ్‌ను పొందడం విశేషం.