Page Loader
మహీంద్రా XUV700 Vs 2023 కియా సెల్టోస్.. ఇందులో ఏ కారు కొనచ్చు?
కియో సెల్టోస్ బుకింగ్స్ ప్రారంభం

మహీంద్రా XUV700 Vs 2023 కియా సెల్టోస్.. ఇందులో ఏ కారు కొనచ్చు?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 28, 2023
01:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణా కొరియా కార్ మేకర్ కియా నుంచి కొత్తగా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ వస్తోంది. జులై 4న ఈ కారును ఆవిష్కరించనున్నారు. ఈ కారుకు సంబంధించిన బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ కారు స్టైలిష్‌గా మరిన్ని ఫీచర్లతో కొత్త సెల్టోస్‌గా రాబోతోంది. మరోవైపు మహీంద్ర XUV700 మోడల్‌ తీసుకొస్తోంది. లుక్ పరంగా ఈ కారు అకర్షణీయంగా రూపొందించారు. ప్రస్తుతం ఈ రెండింట్లో ఏదో బెస్టో ఇప్పుడు మనం తెలుసుకుందాం కియో సెల్టోస్‌లో ఎక్స్టీరియర్, ఇంటిరీయర్లలో చాలా మార్పులు చేశారు. హెడ్‌లైట్ల, డీఆర్ఎల్స్, టెయిల్ లైట్స్‌ని ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. కొత్త డిజైన్‌తో అల్లాయ్ వీల్స్ ఉండగా, గత సెల్టోస్ కార్లలో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఉంటే.. కొత్తగా రాబోతున్న ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో పనోరమిక్ సన్‌రూఫ్ ఉండనుంది.

Details

మహీంద్రా XUV700లో మెరుగైన ఫీచర్లు

మహీంద్రా XUV700లో C-ఆకారపు LED హెడ్‌లైట్‌లు, రూఫ్ రెయిల్‌లు, ఇండికేటర్-మౌంటెడ్ ORVMలు, 18-అంగుళాల అల్లాయ్ రిమ్స్, ర్యాప్-అరౌండ్ LED టెయిల్‌లైట్‌లను కలిగి ఉంది. 2023 కియా సెల్టోస్ పొడవు 4,384mm, వెడల్పు 1,800mm, వీల్‌బేస్ 2,629mmగా ఉండగా,, మహీంద్రా XUV700 4,695mm పొడవు, 1,890mm వెడల్పు, వీల్‌బేస్‌ను 2,750mm కలిగి ఉంది. కొత్త సెల్టోస్‌లో యాంబియంట్ లైటింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండనున్నాయి. మహీంద్రా XUV700లో క్రూయిజ్ కంట్రోల్, USB ఛార్జర్‌లు, ఎయిర్‌ప్యూరిఫైయర్, ఏడు ఎయిర్‌బ్యాగ్‌లతో ముందుకొస్తోంది. కొత్త‌సెల్టోస్ రూ.10.89 లక్షల నుంచి 19.65 లక్షలు ఉండనుంది. XUV700 ధర రూ.14 లక్షల నుంచి 26.18 లక్షలు ఉంది. ఈ రెండింట్లో XUV700లోనే మెరుగైన ఫీచర్లు ఉన్నాయి.