Loading...
Maruti 800 Heritage Award: జర్మనీ, అమెరికా కార్ల సరసన మారుతి 800
జర్మనీ, అమెరికా కార్ల సరసన మారుతి 800

Maruti 800 Heritage Award: జర్మనీ, అమెరికా కార్ల సరసన మారుతి 800

వ్రాసిన వారు Balachander Sharma
Nov 17, 2026
03:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

మారుతి 800కు ఈ గౌరవాన్ని అందించింది ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ వెహిక్యూల్స్ ఏన్సియన్స్ (FIVA). చారిత్రక వాహనాల పరిరక్షణ కోసం పనిచేసే ఈ అంతర్జాతీయ లాభాపేక్షలేని సంస్థకు యునెస్కోతోనూ భాగస్వామ్యం ఉంది. అరుదైనవి, ఖరీదైనవి మాత్రమే చరిత్రలో నిలిచే కార్లు కావని ఈ అవార్డు చాటిచెప్పింది. సామాన్యుల జీవితాలను మార్చిన వాహనాలకూ ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉంటుందని మారుతి 800 ఎంపిక నిరూపించింది.

Details

1983లో సామాన్యుల కారు ప్రయాణం ప్రారంభం

1983 డిసెంబర్‌లో భారత మార్కెట్లోకి వచ్చిన మారుతి 800.. అప్పట్లో కారు కొనడం చాలామంది కుటుంబాలకు ఒక కలగానే ఉండేది.

అలాంటి సమయంలో తక్కువ ధర, చిన్న పరిమాణం, సులభమైన డ్రైవింగ్‌తో ఈ కారు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

1982లో సుజుకి మోటార్ కార్పొరేషన్‌, భారత ప్రభుత్వం కలిసి ఏర్పాటు చేసిన భాగస్వామ్యం ద్వారా ఈ కారు తయారీ ప్రారంభమైంది.

సుజుకి SS80 ఆధారంగా రూపొందిన తొలి మోడల్‌ ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 40 వేల కార్లుగా ఉండేది.

Details

29 లక్షలకు పైగా కార్ల తయారీ

మారుతి 800 దాదాపు మూడు దశాబ్దాల పాటు ఉత్పత్తిలో కొనసాగింది. ఈ సమయంలో 29 లక్షలకు పైగా కార్లు తయారయ్యాయి.

ఇంత భారీ ఉత్పత్తితో దేశీయ ఆటో విడిభాగాల పరిశ్రమకు కూడా ఊతం లభించింది. 1987లో యూరప్‌కు ఎగుమతులు ప్రారంభమయ్యాయి.

హంగరీ, ఫ్రాన్స్‌, బెల్జియం తొలి గమ్యస్థానాల్లో ఉన్నాయి. భారతదేశంలో తయారైన కార్లు విదేశీ మార్కెట్లలోనూ ఆదరణ పొందగలవని ఇది చాటింది.

ADVERTISEMENT

Details

భారత ఆటో పరిశ్రమ ఎదుగుదలకు ప్రతీక

మారుతి 800 ప్రయాణం ఒక కారు విజయంతో ముగిసిపోలేదు. దేశంలో వ్యక్తిగత రవాణా అందుబాటును పెంచడంతో పాటు, స్థానికంగా కార్ల తయారీ సామర్థ్యాన్ని బలోపేతం చేసింది.

సుజుకి మోటార్ కార్పొరేషన్‌ అధ్యక్షుడు తోషిహిరో సుజుకి కూడా భారత్‌లో ఆటో మొబైల్ మార్కెట్ ఇంతగా విస్తరిస్తుందని మొదట్లో ఊహించలేదని గుర్తుచేశారు.

ప్రస్తుతం భారత్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద ప్యాసింజర్‌ వాహన మార్కెట్‌గా ఎదిగింది.

మారుతి సుజుకి ఏటా 120కి పైగా దేశాలకు 4 లక్షలకు మించిన వాహనాలను ఎగుమతి చేస్తోంది. ఈ ఎదుగుదలలో మారుతి 800ది ప్రత్యేక స్థానం.

ADVERTISEMENT