Maruti 800 : మారుతి 800ను లాంబోర్గినీగా మార్చిన జార్ఖండ్ మెకానిక్.. వైరల్ అవుతున్న వీడియో
ఈ వార్తాకథనం ఏంటి
జార్ఖండ్‌కు చెందిన ఓ మెకానిక్ చేసిన వినూత్న ప్రయోగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా కనిపించే మారుతి800 కారును లాంబోర్గినీలా మార్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ అరుదైన మార్పులను చూపిస్తూ అతనే సోషల్ మీడియాలో వీడియో షేర్ చేయగా,అది క్షణాల్లో వైరల్ అయి నెటిజన్లలో చర్చనీయాంశంగా మారింది. జార్ఖండ్‌కు చెందిన ఆరిఫ్ అనే మెకానిక్ ఈ ప్రత్యేక కారును తయారు చేసినట్టు తెలుస్తోంది. ఈప్రాజెక్ట్‌కు సుమారు రూ.4లక్షలు ఖర్చు పెట్టినట్లు సమాచారం.అసలు లాంబోర్గినీ కారుతో పోలిస్తే ఇది చాలా తక్కువ ఖర్చు. ఈ కారును తయారు చేయడానికి రెడీమేడ్ బాడీ కిట్స్ ఉపయోగించకుండా,చాలా భాగాలను కట్ చేసి, వెల్డింగ్ చేసి,చేతితోనే ఆకారంలోకి తెచ్చి లాంబోర్గినీ హురాకాన్ తరహాలో రూపొందించాడు.
వివరాలు
మారుతి800లో ఉండే 12అంగుళాల వీల్స్ స్థానంలో.. 16 అంగుళాల వీల్స్
మారుతి800 కారు సాధారణంగా నేల నుంచి కొంచెం ఎత్తుగా ఉండటంతో,లాంబోర్గినీ లుక్ రావడానికి మెకానిక్ కార్ స్ట్రక్చర్‌లో కొన్ని మార్పులు చేశాడు. దీంతో కారు గ్రౌండ్‌కు దగ్గరగా కనిపించేలా మార్చాడు.అంతేకాకుండా వీల్ ఆర్చ్‌లను కూడా విస్తరించి కారు మరింత వెడల్పుగా కనిపించేలా డిజైన్ చేశాడు. లాంబోర్గినీ హురాకాన్‌కు ఉన్న పదునైన ఆకారంరావడానికి ఫైబర్ గ్లాస్ బాడీ ఉపయోగించినట్టు సమాచారం. కారుకు మరింత స్పోర్టీ లుక్ ఇవ్వడానికి పెద్ద రియర్ వింగ్, ఫ్రంట్ స్ప్లిటర్లు, 16 అంగుళాల వీల్స్ అమర్చాడు. అసలు మారుతి800లో ఉండే 12అంగుళాల వీల్స్ స్థానంలో ఇవి పెట్టాడు. అంతేకాదు,లాంబోర్గినీ కార్లలో కనిపించే వెర్డే మాంటిస్ గ్రీన్ కలర్ తరహా పెయింట్ కూడా వేసి, ముందు భాగంలో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ అమర్చాడు.
వివరాలు
సన్‌రూఫ్ కూడా ఏర్పాటు
కారు ఇంటీరియర్‌లో కూడా పెద్ద మార్పులు చేశారు. లోపల రెండు సీట్ల కాన్ఫిగరేషన్ మాత్రమే ఉండేలా డిజైన్ చేశాడు. అదనంగా తన ప్రత్యేకత చూపిస్తూ సన్‌రూఫ్ కూడా ఏర్పాటు చేశాడు. సాధారణంగా మారుతి 800లో కానీ, లాంబోర్గినీ హురాకాన్‌లో కానీ స్టాక్ మోడల్‌లో సన్‌రూఫ్ ఉండదు. అయితే లాంబోర్గినీ హురాకాన్ ప్రత్యేకత అంటే దాని V10 ఇంజిన్ సౌండ్. కానీ ఈ వైరల్ వీడియోలో కనిపిస్తున్న కారులో మాత్రం మారుతి 800 ఇంజిన్ ఉంది.
వివరాలు
X ప్లాట్‌ఫామ్‌లో 11 లక్షలకుపైగా వ్యూస్
అదే 796 సీసీ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ తో ఇది పనిచేస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా సుమారు 40 హెచ్‌పీ పవర్, 59 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా X (ట్విట్టర్) ప్లాట్‌ఫామ్‌లో 11 లక్షలకుపైగా వ్యూస్ సాధించింది. నెటిజన్లు ఈ క్రియేటివిటీని చూసి ఆశ్చర్యపోతూ, పెద్ద ఎత్తున కామెంట్లు, లైక్‌లు చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే..
🚨 Mohammad Arif, a mechanic from Jharkhand, transformed an old Maruti 800 into a stunning replica of the Lamborghini car by spending just Rs 4 lakh. 🙏 pic.twitter.com/CbvyXcy4vg
— Indian Tech & Infra (@IndianTechGuide) March 4, 2026