LOADING...
Maruti Suzuki: మారుతి తొలి ఎలక్ట్రిక్ SUV 'ఈ-విటారా' లాంచ్.. 100 దేశాలకు ఎగుమతి
మారుతి తొలి ఎలక్ట్రిక్ SUV 'ఈ-విటారా' లాంచ్.. 100 దేశాలకు ఎగుమతి

Maruti Suzuki: మారుతి తొలి ఎలక్ట్రిక్ SUV 'ఈ-విటారా' లాంచ్.. 100 దేశాలకు ఎగుమతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 26, 2025
03:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ఆటో మొబైల్ రంగంలో మరో పెద్ద మైలురాయి చేరింది.దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం 'మారుతీ సుజుకీ' ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి అధికారికంగా అడుగుపెట్టింది. గుజరాత్‌లోని హంసల్‌పూర్‌లో ఏర్పాటు చేసిన సుజుకి మోటార్ ప్లాంట్‌లో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మారుతి సుజుకి తొలి ఎలక్ట్రిక్SUV 'ఈ-విటారా'తొలి యూనిట్‌ను ఆయన జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌, జపాన్ రాయబారి కీచి ఓనో హాజరయ్యారు. ఈప్లాంట్ ప్రారంభం 'స్వయం సమృద్ధ భారత్' యాత్రలో ఒక ముఖ్యమైన రోజు అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇక్కడ తయారయ్యే బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలను 100 దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు.

Details

ఈ-విటారా ప్రత్యేకతలు 

ప్రారంభించిన తొలి ఈ-విటారా యూనిట్‌ను యూకేకు పంపనున్నారు. ఈ ఎలక్ట్రిక్ SUVను గతేడాది ఐరోపాలో తొలిసారి పరిచయం చేశారు. 2025 భారత్ మొబిలిటీ షోలో కూడా ప్రదర్శించారు. టయోటాతో సంయుక్తంగా అభివృద్ధి చేసిన ప్రత్యేక 40పీఎల్ EV ప్లాట్‌ఫామ్‌పై ఈ మోడల్‌ రూపుదిద్దుకుంది. ఇదే ప్లాట్‌ఫామ్‌పై టయోటా 'అర్బన్ క్రూయిజర్ EV'ను కూడా మార్కెట్లోకి తీసుకురానుంది. వినియోగదారులకు రెండు బ్యాటరీ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి 49kWh, 61kWh. పెద్ద బ్యాటరీ వేరియంట్ డ్యూయల్-మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ (AllGrip-E) టెక్నాలజీతో లభ్యం. ప్రారంభ ధర సుమారు రూ. 20 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చని అంచనా. మార్కెట్లో మహీంద్రా BE6, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, ఎంజీ ZS EV మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.