LOADING...
 Maruti Suzuki Victoris​ : రూ.10.5 లక్షలకే మారుతీ సుజుకీ విక్టోరిస్ లాంచ్. ఫీచర్లు, ధరలు ఫుల్ డీటెయిల్స్
రూ.10.5 లక్షలకే మారుతీ సుజుకీ విక్టోరిస్ లాంచ్. ఫీచర్లు, ధరలు ఫుల్ డీటెయిల్స్

 Maruti Suzuki Victoris​ : రూ.10.5 లక్షలకే మారుతీ సుజుకీ విక్టోరిస్ లాంచ్. ఫీచర్లు, ధరలు ఫుల్ డీటెయిల్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 16, 2025
10:50 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత ఆటో మొబైల్ మార్కెట్‌లో కొత్తగా ఒక ఫ్యామిలీ ఎస్‌యూవీ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. మారుతీ సుజుకీ తాజాగా విక్టోరిస్‌ను రూ.10.50 లక్షల ఎక్స్‌షోరూమ్‌ ధరతో లాంచ్ చేసింది. ఈ మోడల్ పెట్రోల్, హైబ్రీడ్, సిఎన్జీ వేరియంట్లలో లభిస్తోంది.

Details

విక్టోరిస్ వేరియంట్లు - ధరలు

విక్టోరిస్‌లో ఎల్‌ఎక్స్‌ఐ, వీఎక్స్‌ఐ, జెడ్‌ఎక్స్‌ఐ, జెడ్‌ఎక్స్‌ఐ (ఓ), జెడ్‌ఎక్స్‌ఐ ప్లస్, జెడ్‌ఎక్స్‌ఐ ప్లస్ (ఓ) వేరియంట్లు ఉన్నాయి. పెట్రోల్ ధరలు: ₹10.50 లక్షల నుంచి ₹17.77 లక్షల వరకు 4 వీల్ డ్రైవ్ ఆప్షన్: ₹18.64 లక్షల నుంచి ₹19.22 లక్షల వరకు సిఎన్జీ ధరలు: ₹11.50 లక్షల నుంచి ₹14.57 లక్షల వరకు స్ట్రాంగ్ హైబ్రీడ్: ₹16.38 లక్షల నుంచి ₹19.99 లక్షల వరకు

Details

ఇంజిన్ & స్పెసిఫికేషన్స్

విక్టోరిస్‌లో 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. దీనికి 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ కనెక్ట్ చేశారు. సిఎన్జీ మోడల్‌లో అండర్‌బాడీ ట్యాంక్ ఉండటంతో బూట్ స్పేస్ తగ్గడం జరగదు. స్ట్రాంగ్ హైబ్రీడ్ వేరియంట్లలో లిథియం-ఐయాన్ బ్యాటరీని అమర్చారు. ఫీచర్లు 64 యాంబియెంట్ లైట్ కలర్ ఆప్షన్లు 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ 35 ప్రీ-లోడెడ్ యాప్స్, ఓటీఏ అప్డేట్స్ సుజుకీ కనెక్ట్‌లో 60 అదనపు ఫీచర్లు డ్యూయెల్ పేన్ సన్‌రూఫ్, PM 2.5 ఎయిర్ ఫిల్టర్ 8 స్పీకర్ ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్ విత్ డాల్బీ అట్మోస్ 8వే పవర్డ్-వెంటిలేటెడ్ సీట్లు

Details

 సేఫ్టీ

విక్టోరిస్ భారత్ ఎన్‌సిఏపీ, గ్లోబల్ ఎన్‌సిఏపీ టెస్టుల్లో 5 స్టార్ రేటింగ్ సాధించింది. ప్రధాన భద్రతా ఫీచర్లు 6 ఎయిర్‌బ్యాగులు ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్) పెడిస్ట్రియన్ ప్రొటెక్షన్ సిస్టమ్ సీట్‌బెల్ట్ రిమైండర్ హెడ్‌అప్ డిస్‌ప్లే 360 డిగ్రీ కెమెరా లెవల్-2 ADAS సపోర్ట్ బుకింగ్స్ మారుతీ సుజుకీ విక్టోరిస్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. వినియోగదారులు సమీప డీలర్‌షిప్ షోరూమ్ లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.