
Maruti eVitara: మారుతి నుంచి తొలి ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ ఛార్జ్ తో 500 KM రేంజ్
ఈ వార్తాకథనం ఏంటి
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఊపందుకుంటోంది. ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థలు నూతన ఫీచర్లతో కూడిన ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
మారుతి రూపొందించిన తొలి ఈవీ మోడల్ పేరు "ఈ-విటారా". ఈ వాహనం భారత్ మార్కెట్‌లో ప్రవేశించనుంది.
ఈ కారులో ఆకర్షణీయమైన స్పోర్టీ LED హెడ్‌ల్యాంప్‌లు, దృఢమైన బంపర్లు ఉంటాయి.
వైపు ప్రొఫైల్‌లో చూసినప్పుడు, ఫెండర్‌పై మోటా క్లాడింగ్, గట్టిగాపడే డోర్ మోల్డింగ్, R18 సైజు ఏరోడైనమిక్ అలాయ్ వీల్స్ కనిపిస్తాయి.
వెనుక భాగానికి వచ్చినప్పుడు, టెయిల్ లైట్లు ముందుభాగంలోని హెడ్‌ల్యాంప్‌లతో లింక్ అయినట్టుగా ఉండే డిజైన్‌లో ఉంటాయి.
వివరాలు
డ్యూయల్-టోన్ థీమ్‌తో ఇంటీరియర్
ఇంటీరియర్ విషయానికొస్తే,ఇది డ్యూయల్-టోన్ థీమ్‌తో ఉంటుంది.
డ్యాష్‌బోర్డ్ డిజైన్ నిటారుగా ఉంటుంది.ఎయిర్ వెంట్స్ కూడా నిలువుగా ఏర్పాటు చేయబడి ఉంటాయి.
ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్ డిజైన్,మల్టీకలర్ అంబియంట్ లైటింగ్ దీన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి.
వాహనంలో ఫిక్స్‌డ్ గ్లాస్ సన్‌రూఫ్, 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ, 10.25 అంగుళాల మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, వైర్‌లెస్ మొబైల్ ఛార్జింగ్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.
భద్రతా అంశాలను కూడా మారుతి మరిచిపోలేదు.ఈవాహనంలో 7 ఎయిర్‌బ్యాగ్‌లు,అన్ని చక్రాలకూ డిస్క్ బ్రేక్స్,టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్(TPMS),బ్రేక్ హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్లు లభ్యమవుతాయి.
అలాగే ముందు మరియు వెనుక పార్కింగ్ సెన్సార్‌లు,360 డిగ్రీల కెమెరా వ్యూ సౌకర్యం కూడా ఉంటుంది.
వివరాలు
ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారుగా 500కిలోమీటర్ల రేంజ్
అంతేకాక,ADAS లెవల్ 2 ఆధునిక భద్రతా ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉంటాయి.
వీటిలో లేన్ కీప్ అసిస్ట్,అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్,బ్లైండ్ స్పాట్ మానిటరింగ్,ఆటోమేటిక్ హై బీమ్ ఫంక్షన్ వంటి ఫీచర్లు ఉంటాయి.
ఈ ఈవీ రెండు వేరియంట్లలో లభించనుందని సమాచారం.. 49kWh,61kWh బ్యాటరీ ప్యాక్‌లతో.
ఇది 2WD,AWD డ్రైవ్ ఫార్మాట్‌లలో లభించనుంది.ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారుగా 500కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.
దీని గరిష్ట వేగం గంటకు 150 నుంచి 160కి.మీ మధ్యగా ఉండనుంది.
ప్రస్తుతం ఈ వాహనం టెస్టింగ్ చివరి దశలో ఉంది.దీన్ని 2025 మే నెలలో భారత్‌లో అధికారికంగా విడుదల చేయవచ్చని అంచనా.
ధర విషయానికి వస్తే, రూ.17లక్షల నుంచి రూ. 30లక్షల మధ్య ఈ వాహనం మార్కెట్లో లభించనుంది.