Loading...
Mercedes-Benz: మెర్సిడెస్‌-బెంజ్‌ సంచలన నిర్ణయం.. జర్మనీలో కొత్త పెట్టుబడులకు బ్రేక్
మెర్సిడెస్‌-బెంజ్‌ సంచలన నిర్ణయం.. జర్మనీలో కొత్త పెట్టుబడులకు బ్రేక్

Mercedes-Benz: మెర్సిడెస్‌-బెంజ్‌ సంచలన నిర్ణయం.. జర్మనీలో కొత్త పెట్టుబడులకు బ్రేక్

వ్రాసిన వారు Balachander Sharma
Nov 13, 2026
12:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

జర్మనీ ఆటో మొబైల్‌ పరిశ్రమలో పరిస్థితులు రోజురోజుకూ కఠినంగా మారుతున్నాయి. ఈ ప్రభావం ఇప్పుడు లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్‌-బెంజ్‌పైనా పడింది. జర్మనీలోని తన ప్లాంట్లలో కొత్త పెట్టుబడులను నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించింది. అంతేకాదు, ఖర్చులు తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా కొన్ని తయారీ కేంద్రాలను మూసివేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తోంది. అధిక ఉత్పత్తి వ్యయాలు, కార్మిక వ్యయాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది.

Details

కార్మిక సంఘాలతో కుదరని ఒప్పందం

జర్మనీలో కార్మిక వ్యయాలను తగ్గించే అంశంపై కంపెనీ యాజమాన్యానికి వర్క్స్‌ కౌన్సిల్‌, యూనియన్‌ ప్రతినిధులతో ఒప్పందం కుదరలేదు.

దీంతో కొత్త పెట్టుబడులను నిలిపివేయాలని నిర్ణయించినట్లు మెర్సిడెస్‌ ప్రొడక్షన్‌ చీఫ్‌ మైఖేల్‌ షీబే తెలిపారు.

గత సెప్టెంబర్‌లోనే ఖర్చులు తగ్గించే చర్యల్లో పురోగతి లేకపోతే జర్మనీలోని రెండు ప్లాంట్లు మూసివేసే పరిస్థితి రావచ్చని ఆయన ఉద్యోగులను హెచ్చరించారు.

Details

ఆటో రంగంలో పెరుగుతున్న సంక్షోభం

మెర్సిడెస్‌ నిర్ణయం ఒక్క కంపెనీకే పరిమితమైన సమస్య కాదని పరిశ్రమ పరిణామాలు చెబుతున్నాయి.

ఇప్పటికే ఫోక్స్‌ వ్యాగన్‌ భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. మరోవైపు ఆటో విడిభాగాల సంస్థ షెఫ్లర్‌ యూరప్‌లో 3,460 ఉద్యోగాలను తగ్గించి, ఐదు ప్లాంట్లను మూసివేయనున్నట్లు ప్రకటించింది.

వీటిలో నాలుగు జర్మనీలోనే ఉన్నాయి. అంతర్గత దహన ఇంజిన్‌ కార్లకు డిమాండ్‌ తగ్గడం కూడా ఈ నిర్ణయాలకు కారణంగా ఉంది.

ADVERTISEMENT

Details

వేల ఉద్యోగాలపై ప్రభావం

జర్మనీ ఆటో రంగంలో పరిస్థితి మరింత తీవ్రంగా మారితే ఉద్యోగాలపై పెద్ద ప్రభావం పడే అవకాశం ఉంది.

రోలాండ్‌ బెర్గర్‌ అంచనా ప్రకారం 2030 నాటికి జర్మనీలో కనీసం 2 లక్షల ఆటోమొబైల్‌ ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది.

చైనా మార్కెట్‌ నుంచి లాభాలు తగ్గడం, చైనా కంపెనీలు యూరప్‌లో మార్కెట్‌ వాటాను పెంచుకోవడం కూడా జర్మన్‌ తయారీదారులకు ఒత్తిడిని పెంచుతోంది.

ADVERTISEMENT

Details

ప్లాంట్ల మూసివేతపై చర్చలు

మెర్సిడెస్‌ యాజమాన్యం ప్లాంట్లను మూసివేయాలనే నిర్ణయానికి ఇంకా రాలేదు. అయితే ఆ అవకాశాన్ని సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేసింది.

ప్రస్తుతం IG Metall యూనియన్‌తో చర్చలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఫోక్స్‌వ్యాగన్‌ కూడా నవంబర్‌ 24 నుంచి యూనియన్‌తో కీలక చర్చలు ప్రారంభించనుంది.

జర్మనీ ఆటో పరిశ్రమకు రాబోయే రోజులు ఎంత కీలకమో ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

ADVERTISEMENT