Mercedes Benz: 3 శాతం ధరలు పెంచిన మెర్సిడెస్ బెంజ్ ఇండియా
ప్రఖ్యాత లగ్జరీ కార్ల బ్రాండ్ అయిన మెర్సిడెస్ బెంజ్ ఇండియా, తన కార్ల ధరలను 3 శాతం పెంచాలని నిర్ణయించింది. ఈ ధర పెంపు 2025 జనవరి 1 నుంచి అమల్లోకి రానుందని కంపెనీ వెల్లడించింది. ధరల పెంపు కారణంగా, కార్ల ధరలు కనిష్ఠంగా రూ.2 లక్షల నుంచి గరిష్టంగా రూ.9 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. ''భారతదేశంలో ద్రవ్యోల్బణం, ఇంధన ధరల పెరుగుదల వంటివి వ్యాపార కార్యకలాపాలపై పెద్ద ఒత్తిడి చూపిస్తున్నాయి. గత మూడు త్రైమాసికాలలో కంపెనీ నిర్వహణ ఖర్చులు పెరిగాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ధరల పెంపు తీసుకోవాలని నిర్ణయించాం'' అని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ సంతోష్ అయ్యర్ అన్నారు.
ఆ వాహనాలకు ఈ ధర పెంపు వర్తించదు
అయితే, డిసెంబరు 31 లోపు బుకింగ్ చేసుకునే వాహనాలకు ఈ ధర పెంపు వర్తించదని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం, మెర్సిడెస్ బెంజ్ దేశీయంగా వివిధ మోడళ్లను విక్రయిస్తోంది, వీటిలో రూ.45 లక్షల ప్రారంభ ధర ఉన్న ఏ క్లాస్ నుంచి రూ.3.6 కోట్ల జీ63 ఎస్‌యూవీ వరకు అనేక రకాల కార్లు అందుబాటులో ఉన్నాయి.