LOADING...
Yamaha: యమహా నుంచి కొత్త ఈవీలు.. ఒక్క ఛార్జ్‌తో 100 కి.మీ పైగా రేంజ్‌!
యమహా నుంచి కొత్త ఈవీలు.. ఒక్క ఛార్జ్‌తో 100 కి.మీ పైగా రేంజ్‌!

Yamaha: యమహా నుంచి కొత్త ఈవీలు.. ఒక్క ఛార్జ్‌తో 100 కి.మీ పైగా రేంజ్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 12, 2025
04:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

యమహా మోటార్ ఇండియా దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలోకి అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో ముంబైలో జరిగిన సంస్థ 70వ వార్షికోత్సవ వేడుకల్లో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆవిష్కరించింది. 'యమహా ఏరోక్స్ ఈ (Aerox E)', 'యమహా ఈసీ-06 (EC-06)' పేర్లతో ఉన్న ఈ మోడళ్లను 2026 చివరి నాటికి భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది. మొత్తం 10 మోడళ్ల వ్యూహంలో భాగంగా ఈ ప్రవేశం జరుగుతుంది. వీటిలో మిగిలిన ఎనిమిది మోడళ్లు ఐసీఈ (Internal Combustion Engine) పవర్డ్ వెర్షన్‌లు, అవి ఈవీల కంటే ముందుగానే మార్కెట్‌లోకి రానున్నాయి.

Details

వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా రూపొందించారు

యమహా తెలిపిన ప్రకారం, ఈ కొత్త ఈ-స్కూటర్లు భారత ప్రభుత్వ 'వికసిత్ భారత్' లక్ష్యానికి అనుగుణంగా రూపొందించారు. ముఖ్యంగా 'ఏరోక్స్ ఈ' మోడల్‌ భారత మార్కెట్ అవసరాలకు సరిపోయేలా ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడిందని సంస్థ తెలిపింది. దీని ధరను 2026 మొదటి త్రైమాసికంలో ప్రకటించనుంది. భారత ఈవీ మార్కెట్లోకి అడుగు పెట్టే ముందు శిక్షణా కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం, అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పరచడం తమ తొలి దశ చర్యలుగా యమహా ప్రకటించింది.

Details

యమహా ఏరోక్స్ ఈ (Aerox E) 

ఈ మోడల్ పనితీరుపై దృష్టి సారించిన ఎలక్ట్రిక్ మ్యాక్సీ-స్కూటర్. ఇది మెరుగైన యాక్సలరేషన్, తక్షణ టార్క్ అందించడానికి డిజైన్ చేశారు. సాధారణ పెట్రోల్ వెర్షన్ ఏరోక్స్‌ మాదిరిగానే, ఈ ఎలక్ట్రిక్ వెర్షన్‌ కూడా చురుకైన, స్టైలిష్ డిజైన్‌తో రోజువారీ ప్రయాణాల కోసం అనువుగా రూపొందించబడింది. ముఖ్యమైన వివరాలు బ్యాటరీ: 1.5 కేడబ్ల్యూహెచ్ సామర్థ్య గల డ్యూయల్ డిటాచబుల్ బ్యాటరీ ప్యాక్‌లు, మొత్తం వినియోగ సామర్థ్యం 3 కేడబ్ల్యూహెచ్‌. మోటార్ పవర్: 9.4 కేడబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటార్‌ ద్వారా శక్తిని పొందుతుంది. టార్క్: 48 ఎన్‌ఎం పీక్ టార్క్‌ అందిస్తుంది. రేంజ్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 106 కి.మీ వరకు రేంజ్ఇ స్తుంది

Details

ఫీచర్లు

డిస్‌ప్లే: 5-ఇంచ్ కలర్ టీఎఫ్‌టీ డ్యాష్‌బోర్డ్‌, బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు టర్న్-బై-టర్న్ నావిగేషన్, మీడియా కంట్రోల్స్. రైడింగ్ మోడ్‌లు: ఎకో, స్టాండర్డ్, పవర్ మోడ్‌లు, ప్రత్యేక 'బూస్ట్ ఫంక్షన్'. భద్రత: ట్రాక్షన్ కంట్రోల్, సింగిల్-ఛానెల్ ఏబీఎస్ సిస్టమ్‌.

Details

యమహా ఈసీ-06 (EC-06) 

ఇది మరింత ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో రూపొందించబడిన ఈవీ. సులభంగా నడపదగిన, రిలాక్స్డ్ ఎర్గోనామిక్స్‌తో, స్టైలిష్ ప్రయాణాన్ని కోరుకునే యువ రైడర్‌లను లక్ష్యంగా చేసుకుంది. ముందు భాగంలో స్టాక్డ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, పదునైన లైన్లతో కూడిన క్లీన్ బాడీ ప్యానెల్లు ఉన్నాయి. ముఖ్యమైన వివరాలు బ్యాటరీ: 4 కేడబ్ల్యూహెచ్ ఫిక్స్‌డ్ బ్యాటరీ ప్యాక్‌. మోటార్ పవర్: 4.5 కేడబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటార్‌, పీక్ పవర్ 6.7 కేడబ్ల్యూ. రేంజ్: ఒక్కసారి ఛార్జింగ్‌పై 160 కి.మీ వరకు రేంజ్. ఛార్జింగ్ సమయం: స్టాండర్డ్ ప్లగ్-ఇన్ ఛార్జర్‌తో సుమారు 9 గంటల్లో పూర్తి ఛార్జింగ్. గరిష్ట వేగం: గంటకు 90 కి.మీ టాప్ స్పీడ్

Details

టెక్ ఫీచర్లు

కనెక్టివిటీ: ఎల్‌సీడీ కన్సోల్‌తో పాటు సిమ్‌తో కూడిన టెలిమాటిక్స్ యూనిట్, దీని ద్వారా రియల్ టైమ్ డేటా యాక్సెస్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ అందుబాటులో ఉంటుంది. రైడింగ్ మోడ్‌లు: ఎకో, స్టాండర్డ్, పవర్, అలాగే 'రివర్స్ మోడ్' కూడా ఉంది. యమహా ప్రకటించిన ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు, ముఖ్యంగా ఏరోక్స్ ఈ, భారత మార్కెట్ అవసరాలకు తగిన విధంగా రూపొందించబడిన మోడల్‌గా నిలవనుంది. సంస్థ లక్ష్యం దేశీయ ఈవీ విభాగాన్ని విస్తరించి, భారతీయ వినియోగదారుల కోసం సాంకేతికంగా అభివృద్ధి చెందిన, శక్తివంతమైన, స్టైలిష్ ఎలక్ట్రిక్ వాహనాలను అందించడమే.