Loading...
Mahindra Thar: ఆగస్టు 15న కొత్త మహీంద్రా థార్‌.. భారీ అప్‌గ్రేడ్లతో రాబోతుందా?
ఆగస్టు 15న కొత్త మహీంద్రా థార్‌.. భారీ అప్‌గ్రేడ్లతో రాబోతుందా?

Mahindra Thar: ఆగస్టు 15న కొత్త మహీంద్రా థార్‌.. భారీ అప్‌గ్రేడ్లతో రాబోతుందా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 11, 2026
12:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన లైఫ్‌స్టైల్‌ SUVల్లో ఒకటైన 'మహీంద్రా థార్‌ 3-డోర్‌' త్వరలో మరింత కొత్తగా మారనుంది. గతేడాది స్వల్ప అప్‌డేట్‌ అందుకున్న ఈ SUVకి ఇప్పుడు కంపెనీ భారీ మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు నిర్వహించే వార్షిక 'ఫ్రీడమ్‌ డ్రైవ్‌ ఈవెంట్‌'లో కొత్త థార్‌ ఫేస్‌లిఫ్ట్‌ను మహీంద్రా ప్రదర్శించే అవకాశం ఉంది. రగ్డ్‌ లుక్‌ను కొనసాగిస్తూనే.. మరింత ప్రీమియం, సురక్షితమైన, అధునాతన ఫీచర్లతో థార్‌ను తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా కస్టమర్లు చాలాకాలంగా కోరుకుంటున్న పలు ఫీచర్లను ఈ కొత్త మోడల్‌లో చేర్చనున్నారు.

వివరాలు

1. థార్‌లోకి ADAS

2026 మహీంద్రా థార్‌ ఫేస్‌లిఫ్ట్‌లో అత్యంత కీలకమైన అప్‌డేట్‌ అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌ (ADAS). ఇటీవల టెస్టింగ్‌ సందర్భంగా కనిపించిన థార్‌ టెస్ట్‌ మ్యూల్స్‌లో విండ్‌షీల్డ్‌ వెనుక భాగంలో ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరా కనిపించింది.

దీంతో కొత్త థార్‌లో ADAS ఫీచర్లు రానున్నాయనే అంచనాలు బలపడ్డాయి. ఇందులో ఫార్వర్డ్‌ కొలిజన్‌ వార్నింగ్‌, ఆటోనమస్‌ ఎమర్జెన్సీ బ్రేకింగ్‌, లేన్‌ డిపార్చర్‌ వార్నింగ్‌, లేన్‌ కీప్‌ అసిస్ట్‌, అడాప్టివ్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

ఈ అప్‌డేట్‌తో థార్‌.. మహీంద్రా కొత్త మోడళ్లైన థార్‌ రాక్స్‌, స్కార్పియో-ఎన్‌ స్థాయిలో ఆధునిక డ్రైవింగ్‌ సేఫ్టీ ఫీచర్లను పొందనుంది. దీంతో ప్రయాణికుల భద్రతతో పాటు డ్రైవింగ్‌పై విశ్వాసం మరింత పెరగనుంది.

వివరాలు

2. డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్

కొత్త థార్‌ క్యాబిన్‌లోనూ కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుతం ఉన్న అనలాగ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ స్థానంలో 10.25 అంగుళాల ఫుల్‌ డిజిటల్‌ TFT ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది.

ఇది స్పీడ్‌, ఆర్‌పీఎం వంటి సాధారణ వివరాలతో పాటు నావిగేషన్‌ గైడెన్స్‌, ఆఫ్‌-రోడ్‌ డేటా, ఇంధన సామర్థ్య సమాచారం, వాహన హెచ్చరికలు వంటి వివరాలను కూడా చూపించనుంది.

డిస్‌ప్లేలో పలు లేఅవుట్‌ ఆప్షన్లు ఉండటంతో డ్రైవర్లు తమకు నచ్చిన విధంగా ఇంటర్‌ఫేస్‌ను మార్చుకునే అవకాశం ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు

3. హర్మన్‌ కార్డన్‌ ఆడియో

కొత్త థార్‌లో ప్రీమియం ఫీల్‌ను పెంచేందుకు హర్మన్‌ కార్డన్‌ ప్రీమియం ఆడియో సిస్టమ్‌ను కూడా అందించనున్నట్లు సమాచారం.

దీంతో ఇప్పటివరకు రగ్డ్‌, యుటిలిటేరియన్‌ SUVగా ఉన్న థార్‌ క్యాబిన్‌ మరింత ప్రీమియంగా, మెరుగైన ఎంటర్‌టైన్‌మెంట్‌ అనుభవాన్ని అందించేలా మారనుంది.

ADVERTISEMENT

వివరాలు

4. రాక్స్‌ తరహాలో కొత్త డిజైన్

థార్‌ ఐకానిక్‌ బాక్సీ డిజైన్‌ను కొనసాగిస్తూనే.. ఎక్స్‌టీరియర్‌లో పలు మార్పులు చేయనున్నారు. థార్‌ రాక్స్‌ డిజైన్‌ నుంచి స్ఫూర్తి పొందిన కొన్ని అంశాలను ఇందులో చేర్చనున్నట్లు తెలుస్తోంది.

కొత్త గ్రిల్‌, సర్క్యులర్‌ LED ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్స్‌, C-ఆకారపు DRLs, రీడిజైన్‌ చేసిన ఫ్రంట్‌ బంపర్‌ వంటి మార్పులు ఉండనున్నాయి.

ఇవి థార్‌కు మరింత షార్ప్‌, ప్రీమియం లుక్‌ను అందించనున్నాయి. స్పై షాట్లలో కనిపించిన టెస్ట్‌ వాహనాల్లో డ్యూయల్‌ టోన్‌ 5-స్పోక్‌ అల్లాయ్‌ వీల్ కూడా గుర్తించారు.

ఇవి 18 అంగుళాల పరిమాణంలో ఉండే అవకాశం ఉంది. టాప్‌ వేరియంట్లలో 19 అంగుళాల వీల్స్‌ అందించే ఛాన్స్‌ ఉంది.

వివరాలు

5. వెంటిలేటెడ్‌ సీట్లు

వెనుక భాగంలో కొత్త డిజైన్‌ కలిగిన LED టెయిల్‌ ల్యాంప్స్‌, విభిన్న లైటింగ్‌ సిగ్నేచర్‌తో పాటు స్వల్పంగా మార్పులు చేసిన బంపర్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది.

దీంతో థార్‌ రగ్డ్‌ స్టాన్స్‌ కొనసాగుతూనే మరింత ఆధునికంగా కనిపించనుంది.

థార్‌ వినియోగదారులు చాలాకాలంగా కోరుకుంటున్న వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లను కూడా కొత్త ఫేస్‌లిఫ్ట్‌లో చేర్చే అవకాశం ఉంది.

ఇప్పటికే ఈ ఫీచర్‌ థార్‌ రాక్స్‌లో అందుబాటులో ఉంది. ముఖ్యంగా వేసవి కాలంలో ప్రయాణికులకు ఇది మరింత సౌకర్యాన్ని అందించనుంది.

వివరాలు

ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్

వెంటిలేటెడ్‌ సీట్లతో పాటు క్యాబిన్‌ కంఫర్ట్‌ను పెంచేందుకు ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌ను కూడా తీసుకురానున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఉన్న మాన్యువల్‌ AC స్థానంలో ఇది అందుబాటులోకి రానుంది. ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌ ద్వారా క్యాబిన్‌లోని ఉష్ణోగ్రతను సిస్టమ్‌ స్వయంచాలకంగా నియంత్రిస్తుంది.

దీంతో డ్రైవర్‌ తరచూ AC సెట్టింగ్స్‌ను మార్చాల్సిన అవసరం తగ్గుతుంది.

మొత్తంగా చూస్తే.. కొత్త థార్‌ ఫేస్‌లిఫ్ట్‌ రగ్డ్‌ SUVగా తన గుర్తింపును కొనసాగిస్తూనే సేఫ్టీ, టెక్నాలజీ, కంఫర్ట్‌, ప్రీమియం ఫీల్‌ విషయంలో భారీగా అప్‌గ్రేడ్‌ కానున్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT