LOADING...
Volkswagen Taigun Facelift: ఫీచర్ల వర్షం కురిపిస్తున్న టైగన్.. పనోరమిక్ సన్‌రూఫ్ ప్రత్యేక ఆకర్షణ
ఫీచర్ల వర్షం కురిపిస్తున్న టైగన్.. పనోరమిక్ సన్‌రూఫ్ ప్రత్యేక ఆకర్షణ

Volkswagen Taigun Facelift: ఫీచర్ల వర్షం కురిపిస్తున్న టైగన్.. పనోరమిక్ సన్‌రూఫ్ ప్రత్యేక ఆకర్షణ

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 09, 2026
03:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

జర్మన్ కార్ల దిగ్గజం వోక్స్‌వ్యాగన్ భారత మార్కెట్‌పై మరింత దృష్టి పెట్టింది. ఐదేళ్ల క్రితం 'ఇండియా 2.0' ప్రాజెక్ట్‌లో భాగంగా వచ్చిన టైగన్ ఎస్‌యూవీని ఇప్పుడు కొత్త హంగులతో ఫేస్‌లిఫ్ట్ రూపంలో తీసుకొస్తోంది. ఇదే విభాగంలో ఉన్నహ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ లకు గట్టి పోటీ ఇవ్వాలనే లక్ష్యంతో ఈ మోడల్‌ను రూపుదిద్దారు. స్కోడా కుషాక్ తరహాలోనే టైగన్‌లో కూడా కీలక మార్పులు చేశారు.

వివరాలు 

కొత్త డిజైన్.. మరింత స్టైలిష్ లుక్

టైగన్ ఫేస్‌లిఫ్ట్‌లో బాహ్య రూపం పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది. ముందుభాగాన్ని పూర్తిగా మార్చి హెడ్‌లైట్లను కొత్త స్టైల్‌లో తీర్చిదిద్దారు. బంపర్ డిజైన్‌ను మరింత స్పోర్టీగా మార్చారు. గ్లోబల్ మోడల్ వోక్స్‌వ్యాగన్ టైరాన్ R-Line డిజైన్‌ను ఇది గుర్తు చేస్తుంది. సైడ్ ప్రొఫైల్‌లో కొత్త అల్లాయ్ వీల్స్ కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి.

వివరాలు 

ఇంజిన్ అదే.. గేర్‌బాక్స్ కొత్త

ఇంజిన్ పరంగా పెద్ద మార్పులు లేవు. ముందున్నట్లే రెండు ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. 1.0 లీటర్ TSI పెట్రోల్ - 113 bhp పవర్, 178 Nm టార్క్ 1.5 లీటర్ TSI పెట్రోల్ - 148 bhp పవర్, 250 Nm టార్క్ ఈసారి ప్రధాన మార్పు ట్రాన్స్‌మిషన్‌లో కనిపిస్తోంది. 1.0 లీటర్ వేరియంట్‌లో ఉన్న 6-స్పీడ్ ఆటోమేటిక్ స్థానంలో ఇప్పుడు 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఇచ్చారు. దీంతో డ్రైవింగ్ మరింత సాఫీగా ఉండే అవకాశం ఉంది. 1.5 లీటర్ ఇంజిన్ మాత్రం యథావిధిగా 7-స్పీడ్ DSGతో కొనసాగుతుంది.

Advertisement

వివరాలు 

ఫీచర్ల హంగామా.. AI నుంచి సన్‌రూఫ్ వరకు

క్యాబిన్‌లోకి వెళ్తే టెక్నాలజీ పరంగా పెద్ద మార్పులు కనిపిస్తాయి. 10.1 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌తో పాటు, ఇన్‌బిల్ట్ Google Assistant సపోర్ట్ ఉంది. అలాగే 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈసారి ముఖ్య ఆకర్షణ పనోరమిక్ సన్‌రూఫ్. టాప్ వేరియంట్లలో ఇది ప్రత్యేకంగా అందిస్తున్నారు. లోయర్ వేరియంట్లలో సింగిల్ పేన్ సన్‌రూఫ్ కూడా ఉంది.

Advertisement

వివరాలు 

భద్రతలో ముందంజ

వోక్స్‌వ్యాగన్ కార్లు అంటే భద్రతకు ప్రసిద్ధి. Global NCAP పరీక్షల్లో ఇప్పటికే 5-స్టార్ రేటింగ్ సాధించిన టైగన్, ఇప్పుడు 40కు పైగా భద్రతా ఫీచర్లతో వస్తోంది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), మల్టీ-కొలీజన్ బ్రేకింగ్, ఫ్రంట్-రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి సదుపాయాలు ఉన్నాయి. కుటుంబాల కోసం ఇది సురక్షిత ఎస్‌యూవీలలో ఒకటిగా నిలుస్తోంది.

Advertisement