
Satellite based toll:మే 1 నుంచి ఉపగ్రహ ఆధారిత టోలింగ్ వ్యవస్థ అమలుపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ!
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా శాటిలైట్ ఆధారిత టోల్ విధానాన్నిమే 1వ తేదీ నుంచి అమలు చేయనున్నట్టు కొన్ని మీడియా సంస్థలు ప్రచురించిన వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
ఈ విధానాన్ని మే 1నుంచి అమలు చేయాలన్నఅంశంపై ఇప్పటికీ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని కేంద్ర రవాణా,జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
శుక్రవారం ఈ మేరకు అధికారికంగా ఒక ప్రకటనను విడుదల చేసింది.
ఆప్రకటన ప్రకారం,వాహనాల నుంచి టోల్ వసూలు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు, టోల్‌ప్లాజాల వద్ద వాహనాలను ఆపాల్సిన అవసరం లేకుండా,ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR)టెక్నాలజీని ప్రయోగాత్మకంగా కొన్ని ఎంపిక చేసిన టోల్ ప్లాజాల వద్ద అమలు చేయనున్నారు.
ఈవిధానంలో ఫాస్టాగ్ వ్యవస్థతోపాటు ANPR కెమెరాల సాంకేతికతను సమిష్టిగా ఉపయోగిస్తారు.
వివరాలు
నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు ఈ-నోటీసులు
వాహనాల నంబర్ ప్లేట్లను ANPR కెమెరాలు స్కాన్ చేసి గుర్తిస్తాయి.
అనంతరం, వాహనాలు ఆగకుండానే, ఫాస్టాగ్ ద్వారా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ సాంకేతికత ఉపయోగించి టోల్ వసూలు చేస్తారు.
ఈ ప్రక్రియలో నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు ఈ-నోటీసులు జారీ చేయడం జరుగుతుంది.
అలాగే, అవసరమైతే వారి ఫాస్టాగ్‌ను రద్దు చేయడం, జరిమానాలు విధించడం వంటి చర్యలు తీసుకుంటారు.
ఇంకా ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా ఎప్పటి నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయాలన్న అంశంపై తుదినిర్ణయం తీసుకోలేదని, పరిశీలన దశలోనే ఉందని రవాణా శాఖ పేర్కొంది.