Auto Industry: జీఎస్టీ ఎఫెక్ట్ దూసుకెళుతున్న ఆటోమొబైల్ రంగం.. నవంబర్ లో కార్లు, బైక్ అమ్మకాల్లో భారీ వృద్ధి
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ ఆటో మొబైల్ రంగం నవంబర్ నెలలో బలమైన అమ్మకాలు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తం సెక్టర్లు చూస్తే డిమాండ్ కొనసాగుతున్నట్టు పరిశ్రమ అంచనా వేస్తోంది. CNBC-TV18 సర్వే ప్రకారం, కమర్షియల్ వాహనాల డిమాండ్ స్పష్టంగా పెరుగుతుండగా, ప్యాసింజర్ కార్లు, రెండు చక్రాల వాహనాల్లో కూడా విచారణ.. అమ్మకం రేటు (enquiry-to-conversion) GST తగ్గింపు తర్వాత మెరుగుపడింది. ఈ నెల ఎక్కువగా శుభ ముహూర్తాలు ఉండటం కూడా రిటైల్ అమ్మకాలకు తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
వివరాలు
బజాజ్ ఆటో రెండు చక్రాల వాహనాల అమ్మకాలు 8% పెరిగి 4.5 లక్షల యూనిట్లకు చేరే అవకాశం
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ప్యాసింజర్ కార్ల సేల్స్ బ్యాక్‌లాగ్ బుకింగ్‌లు,డీలర్ల వద్ద తక్కువ స్టాక్ ఉండటం వల్ల ఇంకా బలంగా కొనసాగొచ్చు. రెండు చక్రాల వాహనాల డిమాండ్ కూడా 2025 నవంబర్ వరకూ నిలకడగా ఉండే అవకాశం ఉందని అంచనాలు సూచిస్తున్నాయి. నోమురా అంచనా ప్రకారం, నవంబర్‌లో ప్యాసింజర్ వెహికిల్స్ 21%,రెండు చక్రాల వాహనాలు 15%, మధ్య-భారీ కమర్షియల్ వాహనాలు 20% వృద్ధి చూపవచ్చని చెబుతోంది. CNBC-TV18 పోలింగ్ ప్రకారం,బజాజ్ ఆటో రెండు చక్రాల వాహనాల అమ్మకాలు 8% పెరిగి 4.5 లక్షల యూనిట్లకు చేరే అవకాశం ఉంది. హీరొ మోటోకార్ప్ అమ్మకాలు 29% పెరిగి 5.95 లక్షల యూనిట్లు,టీవీఎస్ మోటార్ 22% పెరిగి 4.90 లక్షల యూనిట్లు నమోదు చేయవచ్చని అంచనా.
వివరాలు
హ్యుందాయ్ 7% వృద్ధితో 65,600 యూనిట్లు విక్రయించే అవకాశం
రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా 29% వృద్ధితో 1.06 లక్షల యూనిట్ల అమ్మకాలు సాధించే అవకాశముందని నివేదిక చెబుతోంది. నాలుగు చక్రాల వాహనాల విభాగంలో, మారుతీ సుజుకీ అమ్మకాలు 17% పెరిగి 2.13 లక్షల యూనిట్లకు చేరవచ్చు. హ్యుందాయ్ 7% వృద్ధితో 65,600 యూనిట్లు విక్రయించే అవకాశం ఉంది. ఎం&ఎం ఆటో అమ్మకాలు 22% పెరిగి 1.02 లక్షల యూనిట్లకు చేరవచ్చని అంచనా వేయగా, ట్రాక్టర్ డివిజన్ మాత్రం గత ఏడాదితో పోల్చితే పెద్దగా మార్పు లేకుండా 96,518 యూనిట్ల వద్దే ఉండవచ్చు.
వివరాలు
ఆటో సేల్స్ అన్ని విభాగాల్లోనూ స్థిరమైన డిమాండ్
టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 16% పెరిగి 54,767 యూనిట్లు, కమర్షియల్ వాహనాల అమ్మకాలు 17% పెరిగి 32,340 యూనిట్లు నమోదవుతాయని అంచనా. అశోక్ లేలాండ్ అమ్మకాలు 18% పెరిగి 16,730 యూనిట్లు చేరవచ్చని అంచనాలు తెలిపాయి. మొత్తంగా చూస్తే, నవంబర్ ఆటో సేల్స్ అన్ని విభాగాల్లోనూ స్థిరమైన డిమాండ్, అనుకూలమైన మార్కెట్ పరిస్థితులను ప్రతిబింబించే అవకాశముందని పరిశ్రమ నిపుణులు చెప్పుతున్నారు.