Ola Electric: ఓలా ఎఎస్1 శ్రేణిలోని స్కూటర్లపై ప్రత్యేక డిస్కౌంట్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ విద్యుత్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) ప్రత్యేక విక్రయోత్సవాన్ని ప్రకటించింది.
హోలీ పండుగ సందర్భంగా ఎస్1 శ్రేణిలోని ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది.
ఈ విక్రయోత్సవం మార్చి 13 నుంచి ప్రారంభమై మార్చి 17 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
సేల్‌లో భాగంగా ఓలా ఎస్1 ఎయిర్ (S1 Air) కొనుగోలుపై రూ.26,750 డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది.
ప్రస్తుత ధరను పరిశీలిస్తే, ఈ మోడల్ రూ.89,999కి లభిస్తోంది. అదే విధంగా, ఓలా ఎస్1 ఎక్స్+ జెన్2 (S1 X+ Gen 2) మోడల్‌పై రూ.22,000 వరకు రాయితీ ఇవ్వనుంది.
ఈ స్కూటర్ ధర రూ.82,999 నుంచి ప్రారంభమవుతుంది.
వివరాలు
రూ.25,000 వరకు డిస్కౌంట్
అలాగే, ఎస్1 శ్రేణిలోని ఇతర మోడళ్లపై రూ.25,000 వరకు డిస్కౌంట్ ఉంటుందని ఓలా ఎలక్ట్రిక్ వెల్లడించింది.
తాజాగా విడుదలైన ఎస్1 జెన్3 (S1 Gen 3) శ్రేణికి కూడా ఈ ప్రత్యేక ఆఫర్ వర్తిస్తుందని స్పష్టం చేసింది.
డిస్కౌంట్ అదనంగా, రూ.10,500 విలువైన ప్రయోజనాలను కూడా అందిస్తోంది.
కొత్తగా ఎస్1 జెన్2 (S1 Gen 2) స్కూటర్ కొనుగోలు చేసే వారికి, ఏడాది పాటు రూ.2,999 విలువైన మూవ్ ఓఎస్+ (MoveOS+) సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోంది.
అదనంగా, రూ.14,999 విలువైన ఎక్స్‌టెండెడ్ వారంటీని రూ.7,499కే పొందే అవకాశం కల్పిస్తోంది.