Page Loader
ఓలా కీలక నిర్ణయం.. ఇకపై హైదరాబాద్‌లోనూ ప్రైమ్ ప్లస్ సేవలు
ఇకపై హైదరాబాద్‌లోనూ ఓలా ప్రైమ్ ప్లస్ సేవలు

ఓలా కీలక నిర్ణయం.. ఇకపై హైదరాబాద్‌లోనూ ప్రైమ్ ప్లస్ సేవలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 05, 2023
01:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఓలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ప్రైమ్ ప్లస్ సేవలను తాజాగా మరో 3 మహానగరాలకు విస్తరించింది. పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో హైదరాబాద్, ముంబై, పుణె సిటీల్లో శుక్రవారం నుంచే సేవలు అందుబాటులోకి వచ్చాయి. సాధారణ ఓలా క్యాబ్ బుకింగ్ సేవలతో పోలిస్తే ప్రైమ్ ప్లస్ సేవలు మరింత సౌకర్యాన్ని అందించనుట్లు కంపెనీ ప్రకటించింది. ప్రైమ్ ప్లస్ లో నిపుణులైన, టాప్ రేటింగ్ పొందిన డ్రైవర్లే ఉంటారని పేర్కొంది. మరోవైపు రైడ్లను రద్దు చేసేందుకు డ్రైవర్లకు ఆప్షన్ ఉండబోదని, ఈ మేరకు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. ప్రైమ్ ప్లస్ సేవల ద్వారా ఓలా అదనపు ఫీచర్లను అందిస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఓలా సీఈఓ అగర్వాల్ చేసిన ట్వీట్