Mahindra XEV 7e: లాంచ్‌కు ముందే ఫోటోలు లీక్.. మహీంద్రా XEV 7e కారులో కొత్త ఫీచర్లు!
మహీంద్రా తన కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ XEV 7eను త్వరలో విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. లాంచ్‌కి ముందు ఈ కారు ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. దీంతో ఈ వాహనం డిజైన్, ఫీచర్ల గురించి కొంత సమాచారం బయటకొచ్చింది. మహీంద్రా XEV 7e ఈ కంపెనీ నుండి రానున్న మూడవ ఎలక్ట్రిక్ SUV కానుంది. లీక్ అయిన ఫోటోల ప్రకారం, XEV 7e డిజైన్ ఇప్పటికే విడుదలైన XEV 9e, 'BE 6e' మోడళ్లకు సమానంగా ఉంటుంది. కొత్త లోగో, LED లైట్లు, అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్ వంటి ఫీచర్లు దీని లుక్స్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి.
ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించే అవకాశం
ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, మూడు స్క్రీన్ సెటప్, డ్యూయల్ టోన్ టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, ADAS, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, వెంటిలేటెడ్, పవర్డ్ సీట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. మహీంద్రా XEV 7e కారును 2025 జనవరిలో ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించే అవకాశం ఉంది. ఈ SUVను 2025 చివరికి లేదా 2026 ప్రారంభంలో మార్కెట్లోకి విడుదల చేయవచ్చని అంచనా. ఇది టాటా హారియర్ EV , మారుతి E విటారా, MG ZS EV వంటి కార్లకు పోటీగా నిలవనుంది. XEV 7e విడుదలతో మార్కెట్‌లో మహీంద్రా స్థానాన్ని మరింత బలపరుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.