LOADING...
Tata Nexon : టాటా నెక్సాన్ కొనాలనుకుంటున్నారా? ఏ వేరియంట్ బెస్ట్ తెలుసుకోండి
టాటా నెక్సాన్ కొనాలనుకుంటున్నారా? ఏ వేరియంట్ బెస్ట్ తెలుసుకోండి

Tata Nexon : టాటా నెక్సాన్ కొనాలనుకుంటున్నారా? ఏ వేరియంట్ బెస్ట్ తెలుసుకోండి

వ్రాసిన వారు Moogati Shabari
May 13, 2026
11:00 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ ఆటో మొబైల్ మార్కెట్‌లో టాటా నెక్సాన్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు, ఆకర్షణీయమైన డిజైన్‌తో ఎస్‌యూవీ విభాగంలో ఇది ప్రముఖ మోడల్‌గా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ వాహనం టర్బో పెట్రోల్, డీజిల్, సీఎన్జీ అనే మూడు ఇంజిన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. మొత్తం 44 స్టాండర్డ్ వేరియంట్లతో పాటు డార్క్, రెడ్ డార్క్ ఎడిషన్లను కూడా టాటా మోటార్స్ అందిస్తోంది. ఈ నేపథ్యంలో 2026లో నెక్సాన్ కొనాలని భావిస్తున్నవారికి ఏ వేరియంట్ సరిపోతుంది? ఏ మోడల్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? పూర్తి వివరాలు ఇవే.

వివరాలు

టాటా నెక్సాన్ - ఇంజిన్ ఎంపికలు ఇవే..

టాటా నెక్సాన్ మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తోంది: 1.2 లీటర్ టర్బో పెట్రోల్ : ఈ ఇంజిన్ 120 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఏఎంటీ, 7-స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి. 1.2 లీటర్ సీఎన్జీ : ఈ సీఎన్జీ వెర్షన్ 100 హెచ్‌పీ పవర్‌ను ఇస్తుంది. ప్రస్తుతం ఇది కేవలం 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. 1.5 లీటర్ డీజిల్ : 115 హెచ్‌పీ శక్తిని అందించే ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఏఎంటీ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో లభిస్తోంది.

వివరాలు

వేరియంట్ల వారీగా ఫీచర్లు, ధరలు ఇవే..

1. స్మార్ట్ : ధర: రూ. 7.37 లక్షల నుంచి రూ. 8.30 లక్షలు ఇది బేస్ వేరియంట్ అయినప్పటికీ అవసరమైన ఫీచర్లతో వస్తుంది. ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, డీఆర్‌ఎల్స్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు 16 ఇంచుల స్టీల్ వీల్స్ మాన్యువల్ ఏసీ సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ స్టీరింగ్‌పై ఇల్యూమినేటెడ్ టాటా లోగో ఎకో, సిటీ, స్పోర్ట్ డ్రైవ్ మోడ్స్ 6 ఎయిర్‌బ్యాగ్స్ ఈఎస్పీ, ISOFIX మౌంట్స్ రియర్ పార్కింగ్ సెన్సర్లు

Advertisement

వివరాలు

2. స్మార్ట్ ప్లస్ వేరియంట్స్, ఫీచర్లు ఇలా..

ధర: రూ. 8.07 లక్షల నుంచి రూ. 9.22 లక్షలు స్మార్ట్ వేరియంట్ ఫీచర్లతో పాటు అదనంగా.. స్టీల్ వీల్స్‌కు వీల్ కవర్లు 7 ఇంచుల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వైర్డ్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే నాలుగు పవర్ విండోలు ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఓఆర్‌వీఎంలు ఆటోమేటిక్ వెర్షన్‌లో ప్యాడిల్ షిఫ్టర్లు

Advertisement

వివరాలు

3. స్మార్ట్+ ఎస్ ధర, ఫీచర్లు ఇవే..

ధర: రూ. 8.37 లక్షల నుంచి రూ. 9.52 లక్షలు వాయిస్ అసిస్టుతో సింగిల్ పేన్ సన్‌రూఫ్ ఆటో హెడ్‌ల్యాంప్స్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ రూఫ్ రైల్స్ 4. ప్యూర్+ ఫీచర్లు, ధర ఇవే.. ధర: రూ. 8.95 లక్షల నుంచి రూ. 10.64 లక్షలు 10.25 ఇంచుల టచ్‌స్క్రీన్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే రియర్ పార్కింగ్ కెమెరా షార్క్ ఫిన్ యాంటెన్నా

Advertisement