Page Loader
Kia Cars: అక్టోబర్ 1నుంచి కియా కార్ల ధర పెంపు
అక్టోబర్ 1నుంచి కియా కార్ల ధర పెంపు

Kia Cars: అక్టోబర్ 1నుంచి కియా కార్ల ధర పెంపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 21, 2023
05:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా ఇండియా కొన్ని కార్ల మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి ఈ ధరలు అమల్లోకి రానున్నాయని కియా మోటర్స్ సంస్థ స్పష్టం చేసింది. కియా సెల్టోస్, కారెన్స్ ధరలను రెండు శాతం మేర పెంచుకున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలియజేసింది. ఎంట్రీ లెవల్ మోడల్ అయిన సోనెల్ ధరల్లో ఎటువంటి మార్పును చేయలేదు.

Details

అదనపు ఫీచర్లు కారణంగానే ధరల పెంపు

కియా ఇండియాలో చివరిసారిగా ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ధరలను పెంచిన విషయం తెలిసిందే. అయితే కొత్త కర్భన ఉద్గారాలకు అనుగుణంగా కార్లను అప్ గ్రేడ్ చేసిన నేపథ్యంలో అప్పుడు ధరలను సవరించింది. ఇక ముడి సరుకుల ధరలు పెరగడంతో పాటు కొత్త సెల్టోస్ అదనపు ఫీచర్ల కారణంగానే తాజాగా ధరలను పెంచాల్సి వస్తోందని కియా ఇండియా సేల్స్, మార్కెటింగ్ విభాగాధిపతి హార్ధిప్ ఎస్ బ్రార్ వెల్లడించారు.