Loading...
Renault Rafale Hypnotic: రెనాల్ట్ రఫాల్ హిప్నోటిక్ వచ్చేసింది.. 300 HP పవర్, 105 కి.మీ. EV రేంజ్
రెనాల్ట్ రఫాల్ హిప్నోటిక్ వచ్చేసింది.. 300 HP పవర్, 105 కి.మీ. EV రేంజ్

Renault Rafale Hypnotic: రెనాల్ట్ రఫాల్ హిప్నోటిక్ వచ్చేసింది.. 300 HP పవర్, 105 కి.మీ. EV రేంజ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 28, 2026
10:26 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ తన ఫ్లాగ్‌షిప్ SUV రఫేల్‌లో కొత్త లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను ఆవిష్కరించింది. 'రఫేల్ హిప్నాటిక్' పేరుతో తీసుకొచ్చిన ఈ ప్రత్యేక ఎడిషన్‌ను కేవలం 1,500 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయనున్నారు. ఫ్రాన్స్‌లో అక్టోబర్ 1 నుంచి ఈ SUV కోసం బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. దీని ప్రారంభ ధర 63,550యూరోలు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.69 లక్షలు. రఫేల్ హైపర్ హైబ్రిడ్ ఈ-టెక్ 4x4 300 hp అట్లియర్ ఆల్పైన్ వేరియంట్ ఆధారంగా రఫేల్ హిప్నాటిక్‌ను రూపొందించారు. ఈ లిమిటెడ్ ఎడిషన్‌లో శాటిన్ ఫినిష్ బ్లాక్ ఎక్స్‌టీరియర్, బ్లాక్ కలర్ డిజైన్ ఎలిమెంట్స్, మార్పులు చేసిన ఇంటీరియర్‌తో పాటు అదనపు ఫీచర్లను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు.

వివరాలు

ప్రత్యేకంగా కనిపించే బ్లాక్ డిజైన్

2026 పారిస్ మోటార్ షోలో కూడా రెనాల్ట్ ఈ ప్రత్యేక SUVని ప్రదర్శించనుంది. రెనాల్ట్ రఫేల్ హిప్నాటిక్‌లో శాటిన్ ఫినిష్ 'ఫారెస్ట్ బ్లాక్' ఎక్స్‌టీరియర్ కలర్‌ను అందించారు.

దీనికి బ్లాక్ గ్రిల్, 21-అంగుళాల అల్లాయ్ వీల్స్, గ్లోస్ బ్లాక్ రూఫ్ ట్రిమ్, గ్లోస్ బ్లాక్ రియర్ స్పాయిలర్ ఉన్నాయి. అలాగే బ్లాక్ అట్లియర్ ఆల్పైన్ బ్యాడ్జ్‌ను కూడా ఇందులో ఇచ్చారు.

ఈ మార్పులు సాధారణ రఫేల్ మోడళ్లకు భిన్నంగా హిప్నాటిక్ లిమిటెడ్ ఎడిషన్‌ను ప్రత్యేకంగా నిలబెడతాయి.

వివరాలు

ఇంటీరియర్‌లోనూ ప్రత్యేక మార్పులు

క్యాబిన్‌లో బ్లాక్ ఆల్కాంటారా, ఫ్యాబ్రిక్ అప్‌హోల్‌స్టరీని ఉపయోగించారు. వీటికి బ్లూ, వైట్, రెడ్ స్టిచింగ్ అందించారు. సీట్లపై ఇల్యూమినేటెడ్ ఆల్పైన్ లోగో ఉంటుంది.

అంతేకాకుండా ప్రతి వాహనం ప్రత్యేక సంఖ్యతో కూడిన ప్లాక్‌ను కూడా కలిగి ఉంటుంది.

డ్యాష్‌బోర్డ్‌పై ఆల్కాంటారా ట్రిమ్, గ్లోస్ బ్లాక్ డోర్ ఇన్‌సర్ట్స్, బ్లాక్ కార్పెటింగ్, బ్లాక్ స్టోరేజ్ కంపార్ట్‌మెంట్స్‌ను అందించారు. స్టాండర్డ్ ఎక్విప్‌మెంట్‌లో రెనాల్ట్ సోలార్‌బే గ్లాస్ రూఫ్, హీటెడ్ విండ్‌స్క్రీన్, హెడ్-అప్ డిస్‌ప్లే, హార్మన్ కార్డన్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

'హిప్నాటిక్' అనే పేరును ఈ మోడల్ ప్రత్యేకమైన డిజైన్, పరిమిత ఉత్పత్తిని ప్రతిబింబించేలా పెట్టినట్లు రెనాల్ట్ తెలిపింది. రఫేల్ హిప్నాటిక్‌ను రఫేల్ లైనప్‌లో నంబర్డ్ స్పెషల్ ఎడిషన్‌గా అందించనున్నారు.

ADVERTISEMENT

వివరాలు

300 హెచ్‌పీ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్

రఫేల్ హిప్నాటిక్.. రఫేల్ హైపర్ హైబ్రిడ్ ఈ-టెక్ 4x4 300 hp అట్లియర్ ఆల్పైన్ ఆధారంగా రూపొందింది.

ఇందులో ఒక కంబషన్ ఇంజిన్‌తో పాటు మూడు ఎలక్ట్రిక్ మోటార్లు కలిగిన ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను ఉపయోగించారు.

ఈ సిస్టమ్ కలిపి 300 hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం ఎలక్ట్రిక్ పవర్‌తో గరిష్ఠంగా 105 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

ఈ SUVలో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్, 4Control Advanced ఫోర్-వీల్ స్టీరింగ్, కెమెరా ఆధారిత అడాప్టివ్ సస్పెన్షన్ ఉన్నాయి. అడాప్టివ్ సస్పెన్షన్‌ను ఆల్పైన్ ఇంజినీర్ల సహకారంతో అభివృద్ధి చేశారు.

ADVERTISEMENT

వివరాలు

రఫేల్ రేంజ్ ధరలు ఇవే..

రెనాల్ట్ రఫేల్ శ్రేణిలో ప్రారంభ వేరియంట్ అయిన టెక్నో ఫుల్ హైబ్రిడ్ ఈ-టెక్ 200 hp ధర 46,750 యూరోలు. ఎస్ప్రిట్ ఆల్పైన్ ఫుల్ హైబ్రిడ్ ఈ-టెక్ 200 hp ధర 50,750 యూరోలు.

ఎస్ప్రిట్ ఆల్పైన్ హైపర్ హైబ్రిడ్ ఈ-టెక్ 4x4 300 hp ధర 55,750 యూరోలు కాగా.. అట్లియర్ ఆల్పైన్ హైపర్ హైబ్రిడ్ ఈ-టెక్ 4x4 300 hp ధర 60,250 యూరోలుగా ఉంది.

ఇక లిమిటెడ్ ఎడిషన్ రఫేల్ హిప్నాటిక్ హైపర్ హైబ్రిడ్ ఈ-టెక్ 4x4 300 hp ధర 63,550 యూరోలు. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.69 లక్షలు.

ఫ్రాన్స్‌లో అక్టోబర్ 1 నుంచి రఫేల్ హిప్నాటిక్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.

ADVERTISEMENT