LOADING...
Rolls-Royce Cullinan Series II: భారత మార్కెట్లోకి రోల్స్ రాయిస్ కుల్లినన్ సిరీస్ II..పూర్తి వివరాలు ఇవే!
భారత మార్కెట్లోకి రోల్స్ రాయిస్ కుల్లినన్ సిరీస్ II..పూర్తి వివరాలు ఇవే!

Rolls-Royce Cullinan Series II: భారత మార్కెట్లోకి రోల్స్ రాయిస్ కుల్లినన్ సిరీస్ II..పూర్తి వివరాలు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 28, 2024
04:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

రోల్స్ రాయిస్ భారతదేశంలో తమ సూపర్ లగ్జరీ ఎస్‌యూవీ కుల్లినన్ సిరీస్ IIను అధికారికంగా విడుదల చేసింది. ఈ సిరీస్ ప్రారంభ ధర రూ. 10.50 కోట్లు కాగా, బ్లాక్ బ్యాడ్జ్ కల్లినన్ సిరీస్ II ధర రూ. 12.25 కోట్లు (ఎక్స్-షోరూమ్) ఉండనుంది. భారతీయ లగ్జరీ మార్కెట్లో మారుతున్న ట్రెండ్‌లను, కస్టమర్ల ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని ఈ కారును రోల్స్ రాయిస్ ప్రత్యేకంగా డిజైన్ చేసింది. కుల్లినన్ సిరీస్ II డాష్‌బోర్డ్ పైభాగంలో గ్లాస్ ప్యానెల్, రివైజ్డ్ ఇంటీరియర్, అప్‌డేటెడ్ టెక్నాలజీతో కొత్త స్టైలింగ్‌ను అందిస్తోంది. 18-స్పీకర్ ఆడియో సిస్టమ్, Wi-Fi హాట్‌స్పాట్ వంటి ఆధునాతన కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. వెనుక సీట్ల కోసం బ్లూటూత్ ఇన్ఫోటైన్‌మెంట్ కనెక్టివిటీ కూడా ఉంది.

Details

చైన్నై, దిల్లీ షోరూంలో కుల్లినన్ సిరీస్ II

అదనంగా, స్పిరిట్ ఆఫ్ ఎక్స్‌టసీ అన్‌లాక్ సమయంలో యానిమేషన్‌తో డ్రైవర్ డిస్‌ప్లేలో కనిపిస్తుంది. రోల్స్ రాయిస్ కుల్లినన్ ఫేస్‌లిఫ్ట్ 6.75 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V12 ఇంజిన్‌తో వస్తుంది. ఇది 571 hp శక్తి, 850 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బ్లాక్ బ్యాడ్జ్ వెర్షన్ ఇంజన్ 600 hp పవర్, 900 Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ పంపుతుంది. భారతీయ మార్కెట్‌ కోసం మొదటి డెలివరీలు 2024 చివరి త్రైమాసికంలో ప్రారంభం కానున్నాయి. కస్టమర్లు కుల్లినన్ సిరీస్ II, బ్లాక్ బ్యాడ్జ్ వెర్షన్‌లను రోల్స్ రాయిస్ మోటార్ కార్స్ చెన్నై, న్యూ దిల్లీ షోరూమ్‌లలో చూడొచ్చు.