Page Loader
రాయల్​ ఎన్​ఫీల్డ్​ బుల్లెట్​ 350 వర్సెస్​ హోండా హైనెస్​ సీబీ 350 ఈ రెండిట్లో ఏది బెస్ట్​​?
ఈ రెండింటిలో ఏది బెస్ట్​

రాయల్​ ఎన్​ఫీల్డ్​ బుల్లెట్​ 350 వర్సెస్​ హోండా హైనెస్​ సీబీ 350 ఈ రెండిట్లో ఏది బెస్ట్​​?

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 04, 2023
05:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాయల్​ ఎన్​ఫీల్డ్ బుల్లెట్​ 350కి 2023 వర్షెన్​ లాంచ్​ అయ్యింది. ఈ మేరకు దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ రిలీజ్ చేసింది. ఈ బైక్​ హోండా హైనెస్​ CB-350కి గట్టి పోటీగా మారుతుందని మార్కెట్లో అంచనాలు నెలకొన్నాయి. 2023 రాయల్​ ఎన్​ఫీల్డ్​ బుల్లెట్​ 350లో టియర్​డ్రాప్​ షేప్​ ఫ్యూయెల్​ ట్యాంక్​ ఉంది. సర్క్యులర్​ హెడ్​ల్యాంప్​, సిగ్నేచర్​ టైగర్​ ఐ పిలట్​ ల్యాంప్స్​, సింగిల్​ పీస్​ సీట్​, వయర్​ స్పోక్డ్​ వీల్స్​ వంటివి లభిస్తున్నాయి. రౌండ్​ LED హెడ్​ ల్యాంప్​, స్లీక్​ ఎల్​ఈడీ టెయిల్​లైట్​, వైడ్​ హ్యాండిల్​ బార్​, అప్​స్వెప్ట్​ ఎగ్సాస్ట్​, డిజైనర్​ అలాయ్​ వీల్స్​తో లభిస్తుంది. రాయల్​ ధర రూ. 1.74లక్షలు-రూ. 2.16లక్షలు కాగా CB-350 ధర రూ.2.1- రూ.2.15 లక్షల మధ్య ఉంటుంది.

DETAILS

బైక్స్​ ఇంజిన్​, సేఫ్టీ ఫీచర్స్​ తెలుసుకోండిలా

సరికొత్త బుల్లెట్​ 350, హోండా హైనెస్​ CB-350 మోడల్స్​లోని రెండు వీల్స్​కు డిస్క్​ బ్రేక్స్​తో పాటు డ్యూయెల్​ ఛానెల్​ ఏబీఎస్ బ్రేక్స్ ఉన్నాయి. హోండా బైక్​లో హెచ్​ఎస్​టీసీ (హోండా సెలెక్టెబుల్​ టార్క్​ కంట్రోల్​) ఫీచర్​ సైతం వస్తోంది. రెండు బైక్స్​కు ఫ్రంట్ లో టెలిస్కోపిక్​ ఫోర్క్స్​, వెనుకన డ్యూయెల్​ షాక్​ అబ్సార్బర్స్​ వంటివి లభిస్తున్నాయి. బుల్లెట్​ 350లో 349 సీసీ సింగిల్​ సిలిండర్​ జే సిరీస్​ ఇంజిన్​ ఉంది. 20 హెచ్​పీ పవర్​ను, 27ఎన్​ఎం టార్క్​ను ఉత్పత్తి​ చేస్తుంది. CB-350లో 348.6 సీసీ, ఎయిర్​ కూల్డ్​, ఫ్యుయెల్​ ఇంజెక్టెడ్​, సింగిల్​ సిలిండర్​ మోటార్​ తో తయారైంది. 20.8 హెచ్​పీ పవర్​ను, 30ఎన్​ఎం టార్క్​ను ఉత్పత్తి​ చేస్తుంది.