Page Loader
Honda New bike : హోండా నుంచి కొత్తగా ఎస్‌పీ 160 బైక్.. ఫీచర్లు ఇవే!
హోండా నుంచి కొత్తగా ఎస్‌పీ 160 బైక్.. ఫీచర్లు ఇవే!

Honda New bike : హోండా నుంచి కొత్తగా ఎస్‌పీ 160 బైక్.. ఫీచర్లు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 08, 2023
05:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా మోటర్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా మరో కొత్త బైకును మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పటికే 150-160 సీసీ సెగ్మెంట్లో యూనికార్న్, ఎక్స్ బ్లేడ్ బైకులను విక్రయిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సెగ్మెంట్లో ఎస్‌పీ 160 పేరిట మరో బైకును లాంచ్ చేయడం విశేషం. ఈ బైక్ ఎస్‌పీ షైన్, యూనికార్న్ కాంబినేషన్‌ను పోలి ఉండనుంది. బజాజ్ పల్సర్, టీవీఎస్ అపాచీకీ ఈ బైక్ గట్టి పోటినిచ్చే అవకాశం ఉంది. సింగిల్, ట్విన్‌ డిస్క్‌ వేరియంట్లలో ఈ ద్విచక్ర వాహనం లభించనుంది. ఆరు రంగుల్లో ఈ బైక్‌ రానుంది.

Details

ఎస్‌పీ 160 ప్రారంభ ధర రూ.1.17 లక్షలు

ఈ కొత్త ఎస్‌పీ 160 ప్రారంభ ధర రూ.1.17 లక్షలని కంపెనీ పేర్కొంది. హై ఎండ్‌ వేరియంట్ ధర రూ.1.22 లక్షలుగా ఉండనుంది. ఈ బైకులో 162.7 సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ మోటర్ ను అమర్చారు.ఇది 7,500 ఆర్‌పీఎం వద్ద 13.46 బీహెచ్‌పీని, 14.58 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. హై ఎండ్‌ వేరియంట్‌లో ముందువైపు 276 ఎంఎం ఫ్రంట్‌ డిస్క్‌ బ్రేక్‌, వెనుకవైపు 220 ఎంఎం డిస్క్‌ బ్రేకును ప్రత్యేకంగా రూపొందించారు. సింగిల్‌ ఛానెల్‌ ఏబీఎస్‌తో పాటు వెనుక వైపు 130 ఎంఎం డ్రమ్‌ బ్రేక్‌ రానుంది. స్పీడో మీటర్‌, ఓడో మీటర్‌, ఫ్యూయల్‌ గేజ్‌, గేర్‌ పొజిషన్‌ ఇండికేటర్‌ వంటివి అకర్షణీయంగా రూపొందించారు.