అదిరే ఫీచర్లతో హోండా నుంచి కొత్త బైక్.. బెస్ట్ ఫీచర్లు ఇవే!
జపాన్‌కు చెందిన హోండా కంపెనీ ఇండియాలో సరికొత్త బైకును లాంచ్ చేయడానికి సిద్ధమైంది. కొత్త మోడల్ పై పెద్దగా సమాచారం లేకపోయినా, వచ్చే నెలలోనే ఈ లాంచ్ ఈవెంట్ ఉండనుంది. ఈ బైక్ 1600 సీసీ- 180 సీసీ సెగ్మెంట్ మధ్యలో ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 'ప్లే ఇట్ బోల్డ్' అనే క్యాప్షన్‌తో లాంచ్ ఈవెంట్ కోసం హోండా సంస్థ మీడియాకు ఆహ్వానం అందించింది. ప్రస్తుతం హోండా 160-180 సీసీ సెగ్మెంట్‌లో, యూనికార్న్ 160 మోడల్స్ ఉన్నాయి. కొత్త బైక్ కూడా ఇదే రేంజ్ లో ఉండే అవకాశం ఉంది. ప్రీమియం సెగ్మెంట్ బైక్స్ లో బజాబ్, హీరో, టీవీఎస్ మోడల్స్ దూసుకెళ్తున్న విషయం తెలిసిందే.
ఎలక్ట్రికల్ స్కూటర్లపై దృష్టి సారించిన హోండా
ఇండియా మార్కెట్లోకి ఈ ఏడాది షైన్ 100, డియో 125, యాక్టివ్ 125, గ్రేషియా 125 వంటి మోడల్స్ కు అప్డేటెడ్ వర్షెన్ లను హోండా విడుదల చేసింది. దీంతో ఇండియాపై హోండా సంస్థ గట్టిగానే ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. కస్టమర్లలో కూడా హోండాపై ఆసక్తి మరింత పెరిగింది. సీబీఆర్ 250ఆర్ఆర్, సీఎల్ 300లకు ఇటీవలే పేటెంట్ పొందిన హోండా, ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్లపైనా దృష్టిని కేంద్రీకరిస్తోంది. ఈ నేపథ్యంలో హోండా నూతనంగా డాక్స్ ఈ, జూమర్ అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లకు పేటెంట్ లు ఫైల్ చేయడం విశేషం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80కి.మీల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది.