Page Loader
Royal Enfield: విక్రయాల్లో దుమ్మురేపిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌.. మార్చి నెలలో లక్ష యూనిట్ల విక్రయం 
విక్రయాల్లో దుమ్మురేపిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌.. మార్చి నెలలో లక్ష యూనిట్ల విక్రయం

Royal Enfield: విక్రయాల్లో దుమ్మురేపిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌.. మార్చి నెలలో లక్ష యూనిట్ల విక్రయం 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 01, 2025
05:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రసిద్ధ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ మార్చి నెలలో భారీగా విక్రయాలు సాధించింది. మార్చి నెలలో 1,01,021 యూనిట్లను విక్రయించిన ఈ సంస్థ,గత సంవత్సరం ఇదే సమయంలో నమోదైన 75,551 యూనిట్లతో పోలిస్తే 34శాతం వృద్ధి సాధించింది. ఇందులో 88,050 యూనిట్లు దేశీయంగా విక్రయించగా,12,971 యూనిట్లు విదేశాలకు ఎగుమతి చేసినట్లు కంపెనీ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో 10లక్షల మైలురాయిని అధిగమించినట్లు సంస్థ తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 9,12,732 యూనిట్లను విక్రయించిన రాయల్ ఎన్‌ఫీల్డ్,2025 మార్చి నాటికి 11 శాతం వృద్ధితో మొత్తం 10,09,900 యూనిట్ల విక్రయాలు నమోదు చేసింది.

వివరాలు 

ఓలా విక్రయాలు 23,430

ఈ 10 లక్షల మైలురాయిని చేరుకోవడంపై ఎండీ బీ గోవిందరాజన్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. థాయిలాండ్‌లో ప్లాంట్‌ను స్థాపించడమే కాక, బంగ్లాదేశ్ మార్కెట్‌లోకి ప్రవేశించడం వల్ల విక్రయాలు పెరిగినట్లు ఆయన చెప్పారు. ప్రసిద్ధ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మార్చి నెలలో 23,430 వాహనాలను విక్రయించింది. గ్రామీణ, అర్బన్ ప్రాంతాల నుంచి మంచి డిమాండ్ వచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఫిబ్రవరి నెలలో ఇన్‌హౌస్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కారణంగా విక్రయాలు సాఫీగా జరగలేదని చెప్పింది. మరింతగా, ఓలా ఎలక్ట్రిక్ తన జెన్‌3 వాహనాల డెలివరీలను మార్చి నుంచి ప్రారంభించింది. డిమాండ్‌ను అనుసరించి ఉత్పత్తిని పెంచి, ఏప్రిల్ నుంచి వేగవంతమైన డెలివరీలను అందించనున్నట్లు ఓలా వెల్లడించింది.