
Tesla: ఢిల్లీ ఏరోసిటీలో సెకండ్ షోరూమ్.. ఈవీ మార్కెట్ లో స్పీడ్ పెంచిన టెస్లా!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా (Tesla) భారత్‌లో తన విస్తరణను వేగవంతం చేస్తోంది. ఇటీవల ముంబైలో తొలి షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించిన టెస్లా, ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో తన రెండో షోరూంకు సిద్ధమవుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్‌కి చెందిన ఈ సంస్థ ఢిల్లీ ఏరోసిటీలో 4,000 చదరపు అడుగుల షోరూమ్ స్థలాన్ని లీజుకు తీసుకుంది.
Details
ముంబైలో తొలి షోరూమ్ ప్రారంభం
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని ఏరోసిటీలో టెస్లా రెండో షోరూమ్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వరల్డ్‌మార్క్ కాంప్లెక్స్‌లోని ఈ ప్రాంగణానికి నెలకు రూ.25 లక్షల అద్దె కట్టేందుకు సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. పార్కింగ్ సౌకర్యాలు కలిగిన ఈ ప్రాంగణాన్ని ఐదేళ్ల లీజుకు టెస్లా తీసుకుందని రియల్ ఎస్టేట్ వర్గాలు వెల్లడించాయి. ఈ నెలాఖరులో షోరూమ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.
Details
'వై' మోడల్ కార్ల అమ్మకాలు ప్రారంభం
టెస్లా ఇప్పటికే మోడల్ వై ఎలక్ట్రిక్ కార్లను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కార్లు RWD (రియర్ వీల్ డ్రైవ్) మరియు లాంగ్ రేంజ్ RWD వేరియంట్లలో లభిస్తున్నాయి. వీటి ధరలు వరుసగా రూ.59.89 లక్షలు మరియు రూ.67.89 లక్షలుగా (ఎక్స్-షోరూం) ఉండగా, ఆన్-రోడ్ ధరలు రూ.61.07 లక్షలు మరియు రూ.69.15 లక్షలుగా నిర్ణయించారు. ధరల్లో జీఎస్టీ, అడ్మిన్ ఫీజులు కలిపి చేర్చాయి
Details
విదేశీ ధరలతో పోలిస్తే భారత్‌లో పెరిగిన ధరలు
చైనాలోని షాంఘై గిగాఫ్యాక్టరీలో తయారైన ఈ కార్లను దిగుమతి ద్వారా భారత్‌కు తెచ్చారు. అమెరికాలో మోడల్ వై ధర \$44,990 (రూ.38.63 లక్షలు), చైనాలో ¥2,63,500 (రూ.31.57 లక్షలు), జర్మనీలో €45,970 (రూ.46.09 లక్షలు)గా ఉండగా, భారత మార్కెట్లో ఇది ఎక్కువ ధరకు లభిస్తున్నది. దీని కారణంగా దిగుమతి సుంకాలు, రవాణా ఖర్చులే ప్రధాన కారణమని అంచనా. టెస్లా విస్తరణ వేగంగా సాగుతోంది ఇప్పటికే రెండు కీలక నగరాల్లో షోరూమ్లు ప్రారంభించిన టెస్లా, వచ్చే నెలలలో మరిన్ని నగరాల్లో తన శాఖలను విస్తరించనున్నట్లు తెలుస్తోంది. దేశీయ ఈవీ మార్కెట్‌లో పోటీ పెరిగిన వేళ, టెస్లా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.