అద్భుత ఫీచర్లతో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 212km
సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుత ఫీచర్లతో భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. గత కొంతకాలంగా నుంచి ఎదురుచూస్తున్న సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎట్టకేలకు లాంచ్ అయింది. దీని ధర, ఫీచర్లు, బ్యాటరీ వంటి వంటి వివరాలపై ఓ లుక్కేద్దాం. ఈ స్కూటర్ సింపుల్ ఎనర్జీ 2021 ఆగస్టులోనే ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఏదో ఒక అప్ డేట్ తో వినియోగదారుల్లో ఆసక్తిని రేపుతోంది. అయితే కస్టమర్లకు డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ ను ఇవ్వడం కోసం సుదీర్ఘంగా టెస్ట్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించినట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఈ స్కూటర్ ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 212 కిలోమీటర్ల వరకూ ప్రయాణించే అవకాశం ఉంది.
జూన్ 6వ తేదీ నుంచి డెలివరీలు
సింపుల్ వన్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభం ధర రూ.1.45 లక్షలు ఉండనుంది. టాప్ వేరియంట్ ధర రూ.1.58 లక్షలు గా ఉంది.ఒక్క నిమిషంలోనే 1.5 కిలోమీటర్లు ప్రయాణించేందుకు కావాల్సిన ఛార్జింగ్ పూర్తి కానుంది. 5గంటల 50 నిమిషాల్లోనే 80శాతం ఛార్జింగ్ పూర్తి కానుంది. 2.77 సెకన్లలో 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోలగదు. మొత్తం ఆరు రంగుల్లో ఈ స్కూటర్ అందుబాటులో ఉంది. జూన్ 6వ తేదీ నుంచి సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలవరీలు చేస్తామని కంపెనీ స్పష్టం చేసింది. ముందుగా డెలవరీలు బెంగళూరులో ప్రారంభించనున్నట్లు తెలిపింది. సూమారు సంవత్సరన్నర కిందటే ఈ స్కూటర్ బుకింగ్స్ ప్రారంభించడంతో ఇప్పటికే లక్ష వరకు బుకింగ్స్ వచ్చినట్లు సింపుల్ ఎనర్జీ పేర్కొంది.