Loading...
Skoda Kvasiny Plant: స్కోడా ఆటో అరుదైన రికార్డు.. క్వాసినీలో 50 లక్షల కార్ల ఉత్పత్తి
స్కోడా ఆటో అరుదైన రికార్డు.. క్వాసినీలో 50 లక్షల కార్ల ఉత్పత్తి

Skoda Kvasiny Plant: స్కోడా ఆటో అరుదైన రికార్డు.. క్వాసినీలో 50 లక్షల కార్ల ఉత్పత్తి

వ్రాసిన వారు Balachander Sharma
Nov 24, 2026
01:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్కోడా ఆటోకు చెందిన క్వాసినీ ప్లాంట్‌ మరో అరుదైన మైలురాయిని అందుకుంది. 1949లో స్కోడా భాగస్వామ్యంగా మారినప్పటి నుంచి ఈ ప్లాంట్‌లో తయారైన వాహనాల సంఖ్య తాజాగా 50 లక్షలు దాటింది. అయితే క్వాసినీ ప్రయాణం అంతకంటే ముందే మొదలైంది. 1934లో ఇక్కడ కార్ల బాడీల తయారీ ప్రారంభమైంది. దాదాపు 80 ఏళ్లుగా స్కోడాతో కలిసి ప్రయాణిస్తున్న ఈ ప్లాంట్‌ నుంచి కంపెనీ చరిత్రలో గుర్తుండిపోయిన ఎన్నో మోడళ్లు రోడ్డెక్కాయి.

Details

1101 రోడ్‌స్టర్‌ నుంచి ఆక్టేవియా వరకు

క్వాసినీ పేరు వినగానే స్కోడా పాత మోడళ్ల చరిత్ర కూడా గుర్తుకొస్తుంది. స్కోడా 1101 రోడ్‌స్టర్‌, ఫెలిషియా రోడ్‌స్టర్‌, ఆక్టేవియా కాంబి వంటి ప్రముఖ కార్లు ఇక్కడ తయారయ్యాయి.

110 R, 200 RS, 130 RS వంటి స్పోర్ట్స్‌, రేసింగ్‌ కార్లకు కూడా ఈ ప్లాంట్‌ పుట్టినిల్లు. 1957 నుంచి 1964 మధ్య తయారైన 450/ఫెలిషియా రోడ్‌స్టర్‌, 1961 నుంచి 1971 వరకు ఉత్పత్తి చేసిన ఆక్టేవియా కాంబి అప్పట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి.

Details

ఆధునిక టెక్నాలజీతో మారిపోయిన ప్లాంట్

2001లో తొలి తరం సూపర్బ్‌ ఉత్పత్తి ప్రారంభం క్వాసినీకి కీలక మలుపుగా మారింది.

ఆ తర్వాత రూమ్‌స్టర్‌, యెటీ ఎస్‌యూవీ, సూపర్బ్‌ iV వంటి మోడళ్లు వచ్చాయి. కాలానికి తగ్గట్టుగా ప్లాంట్‌లో ఆటోమేషన్‌, డిజిటల్‌ ఉత్పత్తి విధానాలు పెరిగాయి.

రెండు అసెంబ్లీ లైన్లతో అవసరాన్ని బట్టి వేర్వేరు మోడళ్లను తయారు చేసే సౌలభ్యం ఉంది. కొత్త హైబ్రిడ్‌ మోడళ్ల కోసం చాసిస్‌ ప్రీ-అసెంబ్లీ విభాగాన్ని కూడా ఇటీవల ఏర్పాటు చేశారు.

ADVERTISEMENT

Details

2025లోనే 3.01 లక్షల వాహనాల ఉత్పత్తి

ప్రస్తుతం క్వాసినీ ప్లాంట్‌లో కరోక్‌, కొడియాక్‌, ఆక్టేవియా మోడళ్లను తయారు చేస్తున్నారు. ముఖ్యంగా 2024 నుంచి ఆక్టేవియా ఉత్పత్తి కూడా ఇక్కడే జరుగుతోంది.

దాని ఫలితంగా 2025లో ప్లాంట్‌ ఏకంగా 3,01,500 స్కోడా వాహనాలను తయారు చేసి సరికొత్త వార్షిక రికార్డు నమోదు చేసింది.

ఈ ఏడాది వేసవిలో క్వాసినీ నుంచి 10 లక్షల కరోక్‌ కూడా ఉత్పత్తి అయింది.

పాత మోడళ్ల నుంచి ఆధునిక ఎస్‌యూవీలు, హైబ్రిడ్‌ కార్ల వరకు ఈ ప్లాంట్‌ మారుతున్న ఆటో మొబైల్‌ ప్రపంచానికి తగ్గట్టుగా తనను తాను మార్చుకుంటోంది.

ADVERTISEMENT