Bajaj CNG Bike : బజాజ్ CNG బైక్ పై సూపర్ డిస్కౌంట్.. ఈ అవకాశం వదులుకోవద్దు!
బజాజ్ ఆటో ఇటీవల భారతదేశంలో ప్రపంచంలోనే మొదటి సీఎన్‌జీ బైక్‌ను రిలీజ్ చేసింది. బజాజ్ ఫ్రీడమ్ CNG బైక్ పర్యావరణానికి అనుకూలమైన ప్రత్యామ్నాయ ఇంధనంగా తీసుకొచ్చింది. ఈ హైబ్రిడ్ బైక్‌లో రెండు ట్యాంకులు ఉన్నాయి. ఒకటి CNG కోసం 2 కిలోలు, మరొకటి పెట్రోల్ కోసం 2 లీటర్లు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ బైక్ డిజైన్ చేశారు. ఈ బైక్ విడుదలై ఆరు నెలలు గడిచిన తర్వాత, బజాజ్ తాజాగా ధరలను తగ్గించిందని ప్రకటించింది. ఫ్రీడమ్ CNG బైక్‌ను ఇప్పుడే అందుబాటులో ఉన్న తక్కువ ధరల్లో కొనుగోలు చేయవచ్చు. బేస్ వేరియంట్ ఇప్పుడు రూ. 89,997 (ఎక్స్-షోరూమ్) ధరతో రూ. 5,000 తగ్గింపు పొందింది.
330 కి.మీ వరకు ప్రయాణించవచ్చు
మిడ్ వేరియంట్ రూ. 95,002 వద్ద రూ. 10,000 తగ్గింపుతో అందుబాటులో ఉంటుంది. టాప్ స్పెక్స్ డిస్క్ LED వేరియంట్ ధర మాత్రం రూ. 1.10 లక్షలు ఉంటుంది. దీని ధరను తగ్గించలేదు. బజాజ్ ఈ నిర్ణయాన్ని, మార్కెట్‌లో ఫ్రీడమ్ CNG బైక్ అమ్మకాలను పెంచేందుకు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ బైక్ పెట్రోల్ బైక్‌లతో పోలిస్తే అధిక మైలేజీని, తక్కువ నిర్వహణ ఖర్చుతో అందిస్తుంది. ఈ బైక్ 1 కిలో CNGతో 102 కి.మీ, 1 లీటర్ పెట్రోలుతో 65 కి.మీ మైలేజీ ఇస్తుంది. అంటే రెండు ట్యాంక్‌లపై సుమారు 330 కి.మీ వరకు ప్రయాణం చేయవచ్చు. CNG అయిపోతే, పెట్రోల్‌ను సహాయక ఇంధనంగా ఉపయోగించి 130 కి.మీ వరకు ప్రయాణం చేయవచ్చు.