Tata Harrier EV: టాటా హారియర్ ఈవీ లాంచ్.. 2025లో అమ్మకానికి వచ్చే అవకాశం
ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్న కారణంగా ప్రముఖ కంపెనీలు కొత్త మోడళ్లను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి. ఈ రంగంలో టాటా మోటార్స్ మంచి స్థానం సంపాదించింది. టాటా కంపెనీ విక్రయిస్తున్న టియాగో ఈవీ, టిగోర్ ఈవీ, పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీ మోడళ్లకు మంచి ఆదరణ ఉంది. ఇప్పుడు టాటా, సైలెంట్‌గా కొత్త హారియర్ ఈవీని లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ కారు త్వరలోనే మార్కెట్లో అందుబాటులోకి రానుంది.
సాంకేతికత, రేంజ్
హారియర్ ఈవీ భారీ బ్యాటరీ ప్యాక్‌తో పాటు డ్యూయల్ మోటార్ సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ మోడల్ ఆల్-వీల్ డ్రైవ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. పూర్తి ఛార్జింగ్‌పై 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉండనుంది. ఇంటీరియర్, ఫీచర్లు ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో ఐదుగురు సౌకర్యంగా ప్రయాణించవచ్చు. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ ఏసీ, 6-వే పవర్ డ్రైవర్ సీటు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఆధునిక ఫీచర్లతో ఇది వినియోగదారులకు ప్రీమియం అనుభూతిని అందిస్తుంది.
భద్రతా సౌకర్యాలు
భద్రత విషయంలో ఈ వాహనం వినియోగదారుల నమ్మకాన్ని మరింత పెంచేలా ఉంటుంది. ఇందులో 7 ఎయిర్‌బ్యాగులు, ఈఎస్‌పీ, టీపీఎంఎస్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్), హిల్-హోల్డ్, హిల్-డీసెంట్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరాలు వంటి ఫీచర్లు ఉంటాయి. ధర టాటా హారియర్ ఈవీ ధర సుమారు రూ.30 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండవచ్చని అంచనా. వినియోగదారుల అంచనాలను అందుకునేలా ఈ మోడల్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు టాటా మోటార్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇది ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగంలో విశిష్ట స్థానం సాధిస్తుందని భావిస్తున్నారు.