Tata Motors: SUV ప్రేమికులకు గుడ్ న్యూస్… టాటా హారియర్, సఫారి కొత్త డీజిల్ ట్రిమ్స్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
భారత మార్కెట్‌లో టాటా మోటార్స్ తమ ప్రముఖ SUV మోడళ్లైన హారియర్, సఫారి డీజిల్ వెర్షన్లకు కొత్తగా అల్ట్రా ట్రిమ్‌తో పాటు రెడ్ డార్క్ ఎడిషన్‌ను అధికారికంగా విడుదల చేసింది. హారియర్ అల్ట్రా డీజిల్ మాన్యువల్ ప్రారంభ ధర రూ.23.84 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించగా, సఫారి అల్ట్రా డీజిల్ మాన్యువల్ (7 సీటర్) ధర రూ.24.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ కొత్త వేరియంట్ల బుకింగ్స్ ఇప్పటికే దేశవ్యాప్తంగా టాటా డీలర్‌షిప్‌లలో అలాగే కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రారంభమయ్యాయి.
వివరాలు
అదిరిపోయే ఫీచర్లు..
ఈ ఏడాది ప్రారంభం వరకు అల్ట్రా ట్రిమ్, రెడ్ డార్క్ ఎడిషన్‌లు హారియర్, సఫారి పెట్రోల్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉండేవి. తాజాగా చేసిన ఈ అప్‌డేట్‌తో డీజిల్ వేరియంట్ వినియోగదారులకు కూడా ఈ ఫీచర్లు అందుబాటులోకి తీసుకువచ్చింది టాటా మోటార్స్. దీంతో రెండు పవర్‌ట్రైన్‌లలోనూ వేరియంట్ లైన్‌అప్ పూర్తి అయింది. ఈ లాంచ్‌లో ముఖ్య ఆకర్షణగా నిలిచింది రెడ్ డార్క్ ఎడిషన్. డీజిల్ హారియర్‌లో ప్రత్యేకమైన నైట్రో క్రిమ్సన్ ఎక్స్‌టీరియర్ కలర్‌ను అందించారు. దీనికి బ్లాక్ కలర్ 19 ఇంచ్ అలాయ్ వీల్స్, రెడ్ బ్రేక్ కాలిపర్స్ జత చేశారు. డార్క్ ఎడిషన్ డిజైన్‌తో రెండు SUVలకు మరింత స్పోర్టీ, అగ్రెసివ్ లుక్ వచ్చింది.
వివరాలు
టాప్ లెవల్ వేరియంట్..
అదే సమయంలో ప్రీమియం ఫీల్ కూడా అలాగే కొనసాగుతుంది. హారియర్, సఫారి మోడళ్లలో ఈ వేరియంట్ టాప్ లెవల్‌గా ఉంటుంది. ఫియర్‌లెస్ X+, అకాంప్లిష్డ్ X+ ట్రిమ్‌లకు పైగా ఈ ఎడిషన్‌ను ప్లేస్ చేశారు. ఇంటీరియర్ విషయానికి వస్తే, హారియర్, సఫారి రెడ్ డార్క్ ఎడిషన్‌లో కార్నేలియన్ రెడ్ థీమ్‌తో ప్రత్యేక కేబిన్ డిజైన్ అందించారు. రెడ్ లెదరెట్ సీట్లు ఉండటంతో లోపలి భాగం మరింత ప్రీమియం, స్పోర్టీ ఫీలింగ్ ఇస్తుంది. ఫీచర్లలో 36.9 సెంటీమీటర్ల (14.5 ఇంచ్) హార్మన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సామ్‌సంగ్ నియో QLED డిస్‌ప్లే, డాల్బీ ఆట్మాస్ ఆడియో సపోర్ట్, మ్యాప్స్ ఆటో ద్వారా నావిగేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
వివరాలు
సరికొత్త మోడల్ ఇంజిన్..
అలాగే విజన్ X E-IRVM తో ఇన్‌బిల్ట్ డాష్‌క్యామ్, DVR ఫంక్షన్, విజన్ సింక్ మెమరీ ORVMలు ఆటో రివర్స్ డిప్ ఫీచర్‌తో, క్లియర్ వ్యూ డ్యుయల్ కెమెరా వాషర్ సిస్టమ్, స్లైడింగ్ ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్, వైట్-బ్రౌన్ డ్యుయల్ టోన్ ఇంటీరియర్, 65W టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ వంటి అనేక సదుపాయాలు అందించారు. ఇంజిన్ విషయానికి వస్తే, హారియర్, సఫారి రెండు మోడళ్లలోనూ 2.0 లీటర్ క్రయోజెట్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్ అందించారు. ఇది 170PS పవర్, 350Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లను అందించారు.
వివరాలు
రేటింగ్స్ ఎలా ఉన్నాయంటే..
భద్రత పరంగా కూడా ఈ SUVలు మెరుగైన రేటింగ్ సాధించాయి. భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో హారియర్, సఫారి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందాయి. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 32లో 30.08 పాయింట్లు, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 49లో 44.54 పాయింట్లు సాధించాయి.