Page Loader
Tata Nexon CNG Dark Edition: టాటా నూతన సీఎన్జీ వాహనం.. ధర, మైలేజ్, ఇతర ఫీచర్లు తెలుసుకోండి!
టాటా నూతన సీఎన్జీ వాహనం.. ధర, మైలేజ్, ఇతర ఫీచర్లు తెలుసుకోండి!

Tata Nexon CNG Dark Edition: టాటా నూతన సీఎన్జీ వాహనం.. ధర, మైలేజ్, ఇతర ఫీచర్లు తెలుసుకోండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 28, 2025
05:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాటా మోటార్స్ తాజాగా నెక్సాన్ CNG రెడ్ డార్క్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త ఎడిషన్‌ను రూ.12.70 లక్షల నుంచి రూ.13.69 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్ ధరలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది ఫియర్‌లెస్ + PS, క్రియేటివ్ + PS, క్రియేటివ్ + S వంటి మూడు వేరియంట్లలో లభిస్తుంది. 2025లో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఈ కారును కంపెనీ ప్రారంభించింది. రెడ్ డార్క్ ఎడిషన్‌లో రెడ్ కలర్ యాక్సెంట్లతో కార్బన్ బ్లాక్ పెయింట్ స్కీమ్ ఉంటుంది. టాటా నెక్సాన్ CNG రెడ్ డార్క్ క్రియేటివ్ + S: రూ.12.70 లక్షలు, + PS రూ.13.70 లక్షలు, ఫియర్‌లెస్ + PS రూ.13.70 లక్షలగా నిర్ణయించారు.

Details

CNG ట్యాంక్ మొత్తం సామర్థ్యం 60 లీటర్లు

ఈ ఎస్‌యూవీలో అనేక అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి, వాటిలో 10.2-అంగుళాల ఇన్‌ఫోటెయిన్మెంట్ సిస్టం, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, డిజిటల్ ఇన్స్టుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ సీట్లు, జేబీఎల్-8 స్పీకర్ సిస్టం, 360-డిగ్రీ కెమెరా వంటి వాటిని పొందుపరచారు. ఇది 5-సీటర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంటుంది. నెక్సాన్ CNGలో 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది, ఇది 98.5bhp, 170Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. టాటా ట్విన్-సిలిండర్ టెక్నాలజీని ఇందులో ఉపయోగించారు. CNG ట్యాంక్ మొత్తం సామర్థ్యం 60 లీటర్లుగా ఉంది, బూట్ స్పేస్ 321 లీటర్లుగా ఉంటుంది.