టాటా నెక్సాన్ ఫీచర్లలో తగ్గేదేలే.. స్టన్నింగ్ లుక్స్‌తో ముందుకొస్తున్న కొత్త నెక్సాన్ ఈవీ
టాటా మోటార్స్ కు చెందిన బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్. దేశంలో అత్యధికంగా విక్రయమయ్యే ఎస్‌యూవీల్లో టాటా నెక్సాన్ ఒకటి. టాటా తన నెక్సాన్ ఫెస్ లిఫ్ట్ వెర్షన్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే గతంలో పోలిస్తే టెక్ లోడెడ్ ఫీచర్లతో, మోర్ అట్రాక్షన్‌తో మార్కెట్లోకి వస్తోంది. మరోవైపు టాటా నెక్సాన్ ఈవీ కూడా అంతే స్టైలిష్ లుక్, మోర్ ఫీచర్స్ తో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడం గమనార్హం. ప్రస్తుతం ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలను గుర్తిస్తాం. టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీ డిజైన్ పరంగా టాటా నెక్సాస్ వలే కనిపిస్తుంది. కొత్త నెక్సాన్ ఈవీ మునుపటి కంటే బోల్డ్‌గా కనిపిస్తుంది.
ప్రైమ్, మాక్స్ అనే రెండు వేరియంట్లలో వస్తున్న నెక్సాస్
ఇది కొత్త బంపర్ ద్వారా హైలైట్ చేయబడింది. EV వెర్షన్‌లో ఏరో ఇన్‌టేక్‌లను పొందుపరిచారు. LED హెడ్‌లైట్, సిగ్నేచర్ LED DRLలు ముందు భాగంలో బ్లింగ్‌కు జోడించారు. నెక్సాన్, నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ రెండింటిలోనూ సైడ్ లుక్స్ చాలావరకు ఒకే విధంగా ఉంది. నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ధర విషయానికి వస్తే, టాటా మోటార్స్ ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ప్రైమ్, మాక్స్ అనే రెండు వెర్షన్లలో అందిస్తోంది. వాటి ధర రూ.16.50 లక్షల నుండి రూ.19.54 లక్షలు మధ్య ఉండనుంది. కొత్త నెక్సాన్ ఈవీ ధర దాదాపు రూ.15 లక్షల నుండి ప్రారంభమై రూ.20 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది.