Page Loader
Tata : వచ్చే ఏడాది నాలుగు మిడ్'సైజ్ SUVలను విడుదల చేయనున్న టాటా
Tata : వచ్చే ఏడాది నాలుగు మిడ్'సైజ్ SUVలను విడుదల చేయనున్న టాటా Tata : వచ్చే ఏడాది నాలుగు మిడ్'సైజ్ SUVలను విడుదల చేయనున్న టాటా

Tata : వచ్చే ఏడాది నాలుగు మిడ్'సైజ్ SUVలను విడుదల చేయనున్న టాటా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 06, 2023
04:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాటా మోటార్స్'కి సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ అందింది. ఈ మేరకు వచ్చే ఏడాది నాలుగు మిడ్'సైజ్ Suvలను కంపెనీ విడుదల చేయనుంది. ఇటీవలే టాటా కంపెనీ నెక్సాన్ సహా అప్‌డేట్ చేయబడిన హారియర్, సఫారీలను లాంచ్‌ చేశాయి. ఈ నేపథ్యంలోనే 2024 నాటికి భారతదేశంలో నాలుగు మిడ్-సైజ్ SUVలను పరిచయం చేయనుంది. ఈ మేరకు ఇదే ఒరవడిలో టాటా కర్వ్, టాటా హారియర్ EV, హారియర్, సఫారి పెట్రోల్ వెర్షన్‌లు ఉండనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ కొత్త మోడల్‌లు భారతీయ ఆటో మార్కెట్ వినియోగదారుల విభిన్న ప్రాధాన్యతలను తీర్చడమే లక్ష్యంగా ఉండనున్నాయి. ఇదే సమయంలో మధ్యతరహా SUV మార్కెట్లో ఇతర పోటీదారులతో పోటీ పడతాయి.

details

వచ్చే ఏడాది రోడ్లపైకి రానున్న టాటా కర్వ్

ఇక Tata Curvv వచ్చే ఏడాది రోడ్లపైకి రానుంది.ఈ మేరకు చేపట్టిన పరీక్షలు పురోగతిలో ఉన్నాయి.ఈ కారు డిజైన్ కాన్సెప్ట్ మోడల్‌కు అనుగుణంగా ఉంటుంది గనక వెనుక వైపున సొగసైన,కూపే లాంటి రూఫ్‌లైన్ ఉంటుంది. Curvv డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి అనేక రకాల ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇంజిన్ ఎంపికలు ఒక EV వేరియంట్‌ను కలిగి ఉంటాయి.తర్వాత ICE వెర్షన్, బహుశా కొత్త టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో అందించనున్నట్లు తెలుస్తుంది. టాటా మోటార్స్ ఇటీవలే పునరుద్ధరించిన హారియర్ EV వెర్షన్‌ను విడుదల చేసేందుకు ప్రణాళికలు రెఢీ చేసింది.దీన్ని తొలుత 2023 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించారు.