Tesla Cybertruck RC Racer: చౌకైన టెస్లా సైబర్‌ట్రక్ ఇదే.. రిమోట్ కంట్రోల్‌తో కొత్త మోడల్
ఈ వార్తాకథనం ఏంటి
టెస్లా సైబర్‌ట్రక్‌ను ఇష్టపడే వారికి కంపెనీ ఓ ఆసక్తికరమైన సర్‌ప్రైజ్ ఇచ్చింది. అమెరికా ఆన్‌లైన్ స్టోర్‌లో తొలిసారిగా 1:10 స్కేల్ Cybertruck RC Racerను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ధర 350 డాలర్లు, అంటే భారత కరెన్సీలో సుమారు రూ.32,950. అసలు సైబర్‌ట్రక్ డిజైన్‌ను చిన్న రూపంలో తీసుకొచ్చిన ఈ మోడల్ కేవలం బొమ్మలా కాకుండా, నిజమైన రిమోట్ కంట్రోల్ వాహనం తరహాలో పనిచేస్తుంది.
Details
60 కిలోమీటర్ల వేగం
ఈ చిన్న సైబర్‌ట్రక్‌లోనూ టెస్లా పనితీరుపై దృష్టి పెట్టింది. ఆల్-వీల్ డ్రైవ్, బ్రష్‌లెస్ మోటార్, ఇండిపెండెంట్ సస్పెన్షన్ ఇందులో ఉన్నాయి.
ఒకే బ్రష్‌లెస్ మోటార్ డ్రైవ్‌షాఫ్ట్‌ల ద్వారా రెండు యాక్సిల్స్‌కు శక్తిని పంపుతుంది. దీంతో ఇది గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
2.4GHz రేడియో సిస్టమ్ సుమారు 100 మీటర్ల దూరం వరకు స్థిరంగా పనిచేస్తుందని టెస్లా చెబుతోంది.
Details
20 నిమిషాల రన్‌టైమ్
బ్యాటరీ విషయంలోనూ RC Racer ప్రత్యేకంగా కనిపిస్తుంది. బాక్స్‌లోనే USB-C ఛార్జర్ వస్తుంది.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 20 నిమిషాల రన్‌టైమ్ లభిస్తుంది. బ్యాటరీ ఛార్జ్ చేయడానికి పాలీకార్బొనేట్ బాడీని త్వరగా తొలగించి, బ్యాటరీని మోటార్ నుంచి డిస్‌కనెక్ట్ చేయాలి.
పూర్తిగా ఛార్జ్ కావడానికి దాదాపు మూడు గంటలు పడుతుంది.
Details
రిమోట్‌లోనూ ప్రత్యేక ఫీచర్లు
ఈ RC Racer రిమోట్‌లో స్టీరింగ్ కోసం సైడ్ వీల్, వేగం, బ్రేక్, రివర్స్ కోసం ట్రిగ్గర్ ఉన్నాయి. స్టీరింగ్ అలైన్‌మెంట్, థ్రాటిల్ ట్రిమ్, రివర్స్, గైరో స్టెబిలిటీ వంటి కంట్రోల్స్ కూడా ఇచ్చారు.
గైరో ఫీచర్ వాహనం అదుపుతప్పి తిరగకుండా కౌంటర్ స్టీరింగ్ సాయాన్ని అందిస్తుంది.
టెస్లా ప్రకారం Cybertruck RC Racer డెలివరీలు వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్నాయి.
అయితే ఇది చిన్న పిల్లల కోసం కాదు. 14 ఏళ్లలోపు పిల్లలకు ఈ మోడల్ అనుకూలం కాదని కంపెనీ స్పష్టం చేసింది.
భవిష్యత్తులో అదనపు బ్యాటరీలు, స్పేర్ పార్ట్స్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.